తేలుకుట్టిన దొంగబాబు

దొంగ బాబు అసలు పేరు కూడా దొంగబాబే. దొంగ బాబు బుద్ధి కూడా దొంగ బుద్ధే. ఇక దొంగ బాబు చేసే పని మాత్రం వేరే ఎందుకౌతుంది...అదీ దొంగపనే. 
పొరపాటున దొంగబాబు చేతికి అధికారం వచ్చింది. దాంతోపాటే గల్లాపెట్టె తాళం చేతికొచ్చింది.  అంతులేని అవినీతి చేసే అవకాశం దొంగబాబుకు చిక్కింది. 
అంతే అంతకంతకూ రెచ్చిపోయాడు దొంగ బాబు.
రూపాయి చోట పది రూపాయిలు, పది చోట వంద రూపాయిలు ఖర్చు చేసేసాడు.
కోటికి పది కోట్లు అంటూ దొంగ లెక్కలు రాసేసాడు.
టెండర్లకే టెండర్లు వేసేసాడు.
గల్లాపెట్టను కాస్తా కాలిన కర్పూరంలా ఖాళీ చేసేసాడు.
అయితే  కాలం ఎల్లకాలం ఒకలా ఉండదుగా. 
దొంగబాబు దొంగ బుద్ధి కనిపెట్టి అధికారం ఆమడదూరం పారిపోయింది. 
దొంగబాబు దొంగతనం పట్టుబడిపోయింది. చేసిన దొంగతనం బయటపడిపోయింది. కమీషన్లుగా కొల్లగొట్టిన సంగతి కన్ఫర్మ్ అయ్యిపోయింది. 
కానీ దొంగతనం చేసిన దొంగ బుద్ధి ఉన్న దొంగబాబు దొంగతనం చేసానని మాత్రం ఒప్పుకుంటాడా??
పట్టుబట్టి దబాయిస్తాడు!! గట్టిగా గదమాయిస్తాడు!! 
నేను నిప్పు. నా ఇంటిపేరు తుప్పు అంటాడు!!
ఆట్టే మాట్టాడితే నాది దొంగతనమే కాదు దొరతనం అని రెట్టిస్తాడు. 
అలాంటి టైమ్ లోనే దొంగబాబుకు సీన్ రివర్స్ అయ్యింది. 
పాపాలను బద్దలు కొట్టే టెండర్ కన్ఫం అయ్యింది.
బాబు లెక్కల్లోని గిమ్మిక్కుల గుట్టులు తెలిసాయి.
తప్పుల తడకల చరిత్రలు తెలిసాయి..
చిట్టాపద్దులు ఆడిట్ అయ్యాయి...
నిప్పు బాబు నోటికి తాళాలు పడ్డాయి
తేలుకుట్టిన దొంగబాబు దొరికిపోయి దిక్కుతోచక దొడ్డిదారి పట్టాడు...

 

Back to Top