వైద్యం చేయించేంత ఆర్థిక స్తోమత లేదు

కృష్ణాజిల్లా : ‘అన్నా.. మాకు ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సాత్విక్‌కు ఏడు నెలల క్రితం వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. జ్వరంలో మానసిక స్థితి దెబ్బతింది. అప్పటి నుంచి పిచ్చిగా ప్రవర్తిస్తూ కేకలు వేస్తున్నాడు. చాలా ఆస్పత్రులు తిరిగాం. మందులు ఇచ్చారు. కానీ సాత్విక్‌కు రోగం నయమవుతుందో లేదో చెప్పడం లేదు. డాక్టర్లు చెన్నై తీసుకెళ్లమని చెప్పారు. నా భర్త కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వైద్యం చేయించేంత ఆర్థిక స్తోమత లేదు. వచ్చే జీతం కుటుంబ పోషణకే సరిపోతోంది. పిల్లాడి వైద్యానికి ఇబ్బందిగా ఉంది’ అంటూ గన్నవరం గ్రామానికి చెందిన స్వర్గం సరస్వతి ప్రజాసంకల్పయాత్రలో పురుషోత్తంపట్నం చేరుకున్నవైయ‌స్‌  జగన్‌ను కలిసి తమ బాధలు వివరించారు. తమ బాబును ఆదుకోవాలని జననేతను వేడుకున్నారు.
Back to Top