పులివెందుల : వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా బుధవారం లింగాల మండలం తాతిరెడ్డి పల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. వైయస్ జగన్ తన హయాంలో రామాలయానికి రూ.34లక్షలు మంజూరు చేశారు. ఇక, వైయస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత రావడంతో ప్రజలు వైయస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. వైయస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ,వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు.