విద్యుత్ వినియోగదారుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం 

ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి  

అన్నమయ్యజిల్లా: అధికారంలోకి రాకముందు ఎన్నోహామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. మంగళవారం రాజంపేట వైయ‌స్ఆర్‌సీపీ  కార్యాలయంలో అమర్‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధినేత వైయ‌స్‌ జగన్‌ పిలుపుమేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడుపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేయనుంది.

ప్రతి నియోజక వర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్‌ల ఎదుట ధర్నా చేయనున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి’అని అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

Back to Top