అమరావతి: పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబరు 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకర్గాల్లో వైయస్ఆర్‌సీపీ నేతలు విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట పోస్టర్ ను ఆవిష్కరించారు. విజయనగరం జిల్లా. బొబ్బిలి నియోజకవర్గంలో విద్యుత్ చార్జీల పెంపుపై 27న జరగబోయే పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువులు వైయస్ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శంబంగి మాట్లాడుతూ... విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీలు ఇచ్చి, అవసరమైతే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారం చేపట్టగానే విద్యుత్ ఛార్జీల బాదుడు మొదలెట్టారని మండిపడ్డారు. వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా. కూటమి ప్రభుత్వ కరెంటు ఛార్జీలు పెంపుపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్ ను విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వి. విజయసాయిరెడ్డి కామెంట్స్. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలపై భారం మోపకుండా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తున్నాం. మేము ఎన్టీయే కూటమిలోనూ, ఇండియా కూటమి లోనూ లేము, న్యూట్రల్ గా ఉన్నాం. ఏ కూటమితోనూ అనుసంధానం కాకుండా... ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కాపాడేందుకు జాతీయ, రాష్ట్ర స్ధాయిలోనూ వైయస్ఆర్‌సీపీ ఒంటరిగా పోరాటం చేస్తుంది. ఏ కూటమిలోనే చేరే ప్రసక్తి లేదు. ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెడతారని తాము ముందునుంచి చెబుతున్నట్టే పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రిఫర్ చేసిన జేపీసీలో నేను కూడా సభ్యుడుగా ఉన్నాను. సాధారణంగా ప్రభుత్వం సభలో బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు తర్వాత చూసుకుందామని ఎవరూ వ్యతిరేకించరు. అలాంటిది ఈ బిల్లును ఇండియా కూటమి డివిజన్ కోరి ఎన్నికలకు వెళ్ళింది. ఈ బిల్లును కొన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా వ్యతిరేకించగా, కొన్ని ఆమోదించాయి. ఈ నేపధ్యంలో జేపీసీ అన్ని రాష్ట్రాలకు వెళ్లి అక్కడున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకుల మనోభావాలను తెలుసుకుని నివేదిక సమర్పిస్తుంది. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు జమిలి ఎన్నికల బిల్లు ప్రాధమిక దశలో దాన్ని వ్యతిరేకించలేదు. దీనిపై ఆయన తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటులో కానీ, జేపీసీ ముందు కానీ పార్టీ వైఖరి చెబుతాం. గుడివాడ అమర్నాథ్, వైయస్ఆర్‌సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నీ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టడానికి ఇచ్చిన అబద్దపు హామీలే. ఎన్నికలు ముగిసిన వెంటనే వాటిని మర్చిపోతారన్న విషయం ఆ రోజే మేము చెప్పాం. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే విద్యుత్ ఛార్జీలమీద రూ.15వేల కోట్లు భారం మోపారు. చివరకు ఎస్సీ, ఎస్టీలకిచ్చే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ను రద్దుచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు. వైన్ షాపులను బెల్టుషాపుల దగ్గర, పోలీసులు చలాన్ల రూపంలోనూ ఇలా అన్నిశాఖలను సంపదసృష్టికి వదిలిపెట్టారు. ప్రజలకు చేసిన మంచి పనులేం లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడున్నర లక్షల కోట్లు అప్పలు చేశారని ఆరోపణలు చేశారు. అయితే అందులో రూ.2.75 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. అయితే కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.1 లక్ష కోట్లు అప్పులు చేసి ఏం సంక్షేమం చేశారో సమాధానం చెప్పాలి. కూటమికి ఓటేసిన నాయకులు తలదించుకునే పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నారు. అందుకే ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిలుపుమేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కాకినాడ జిల్లా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈనెల 27న వైయస్ఆర్‌సీపీ పోరుబాట. కాకినాడ రూరల్ వైయస్ఆర్‌సీపీ కార్యాలయం లో పోరుబాట పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు. పిఠాపురంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి చేపట్టే పోరుబాట పై పోస్టర్ ను ఆవిష్కరించిన నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత. ఏలూరు జిల్లా. చింతలపూడి మండలం చింతలపూడి లో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ గారి పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన జరిగే "కరెంట్ చార్జీలు బాదుడుపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట" పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న నియోజకవర్గ కన్వినర్ కంభం విజయరాజు. వీరితో పాటు జిల్లా మున్సిపల్ అధ్యక్షులు బొడ్డు వెంకటేశ్వరావు, ప్రచార విభాగం అధ్యక్షులు చిలుకూరి జానారెడ్డి, జడ్పీటీసీ నీరజ, ఎంపీపీ రాంబాబు,టౌన్ అధ్యక్షులు కొప్పుల నాగు, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా. పాలకొల్లు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలపై పోరుబాట పోస్టర్ ను ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీహరి గోపాలరావు. శ్రీహరి గోపాలరావు కామెంట్స్. మహాకూటమి కాదు ఇది మాయా కూటమి. చంద్రబాబునాయుడు హామీలు అన్ని మోసపూరిత హామీలు కరెంటు చార్జీల బాదుడు పై వైయస్ఆర్‌సీపీ పోరుబాట. ఈనెల 27న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయం వద్ద ప్రజల తరుపున భారీ ర్యాలీ గా నిరసన వినతిపత్రం సమర్పణ. తక్షణమే గృహవినోగదారులపై మోపిన 15,485.36 కోట్ల చార్జీలు బాదుడును వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చార్జీలు పెంపును నిలిపివేయాలి . ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానసాగించాలి. కార్యకర్తలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, ఉచ్చుల స్టాలీన్ , ఖండవల్లి వాసు,జోగడ ఉమా మహేశ్వర రావు, ఏలూరు జిల్లా. కొయ్యలగూడెంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 27వ తేదీన జరిగే "కరెంట్ చార్జీలు బాదుడు పై పోస్టర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో కరెంటు చార్జీలు బాదుడు పై వైయస్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్ ను ఆవిష్కరణ. పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, వైయస్ఆర్‌సీపీ నాయకులు. ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీల పై వైసీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ. ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,సెంట్రల్ నియోకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి,వైసీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే,మల్లాది విష్ణు. ఈనెల 27న విద్యుత్ ఛార్జీల పెంపు పై నిరసన విద్యుత్ ఛార్జీలు పెంచనని అనేక సభల్లో చంద్రబాబు చెప్పాడు అధికారంలోకి రాగానే ప్రజల పై 15 వేల కోట్ల మేర భారం మోపారు ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలు పెంచేశారు ప్రజలను వంచించి పన్నులు వసూలు చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోంది ఎస్సీలకు గత ప్రభుత్వంలో 200 యూనిట్లు లోపు ఉచితంగా విద్యుత్ ఇచ్చాం కూటమి వచ్చిన తర్వాత సోలార్ కనెక్షన్లు పెట్టుకోవాలని ఇబ్బంది పెడుతున్నారు డిప్యూటీ మేయర్,శైలజా రెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఛార్జీల పేరుతో వంచిస్తున్నారు మేం పెంచం ... ఎవరినీ ఇబ్బంది పెట్టనన్నారు . సంపద సృష్టి అంటే ప్రజల నడ్డి విరిచి పన్నులు వసూలు చేయడమేనా చంద్రబాబు ఎవరికోసం పరిపాలన చేస్తున్నారో చెప్పాలి ఆరు నెలల్లో మంచి పాలన లేదు...ఒక్క పథకం లేదు. నంద్యాల జిల్లా ... మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కామెంట్స్ .... ఈ నెల 27 వ తేదిన పెంచిన కరెంట్ చార్జీల పై పోరుబాట పట్టనున్న వైయస్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్లను వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి విడుదల చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలను మోసగించిన కూటమి ప్రభుత్వం పై పోరుబాట, టిడిపి అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచే ప్రసక్తే ఉండదు అన్న నాడు చంద్రబాబు చెప్పి మోసం చేసాడు .నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం రైతులకు విద్యుత్ స్థంబాలు,పరికరాలు అందించకుండా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారు ప్రజల పక్షాన ఎంతవరకు అయిన పోరాటాలు చేస్తాం అని హెచ్చరించిన కాటసాని రామిరెడ్డి ... శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం లోని వైయస్సార్ సర్కిల్లో కరెంటు చార్జీల బాదుడుపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్లు విడుదల చేసిన సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీల బాదుడుపై డిసెంబర్ 27న నిర్వహించబోయే వైఎస్ఆర్సిపి పోరుబాట పోస్టర్లు విడుదల చేసిన సమన్వయకర్త దీపిక,వైయస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు. అన్నమయ్య జిల్లా: రాజంపేట వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ రెడ్డి మీడియా సమావేశం... కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది...అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచింది... ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు...మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపుమేరకు 27న విద్యుత్ చార్జీల బాదుడే బాదుడిపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట...ప్రతి నియోజక వర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ ల ఎదుట ధర్నా చేయనున్నాం...ప్రస్తుతం విద్యుత్ వినియోగదారుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తోంది...ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి... అనంతపురం: ఉరవకొండ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో విద్యుత్ చార్జీలపై పోరుబాట పోస్టర్లు విడుదల చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఈ నెల 27 న ఉరవకొండ విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా కు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు. శింగనమల మండల కేంద్రంలో ఉన్న రామాలయం దగ్గర కరెంటు చార్జీలపై పోరుబాట పోస్టర్లు విడుదల చేసిన నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు, మరియు పార్టీ నేతలు.