క్రీస్తు బోధనలు సన్మార్గంలో నడిపిస్తాయి

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌

వైయ‌స్ఆర్ జిల్లా: క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రెస్తవులందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 
కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు.
దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారని తెలిపారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.


క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ‌లో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో క్రిస్మస్‌ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో  మాజీ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పాస్ట‌ర్లు క్రిస్మ‌స్ సందేశాన్ని అందించి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రార్థ‌న కార్య‌క్ర‌మంలో వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Back to Top