వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్‌.. ఏ కూట‌మిలో లేదు 

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి 

విశాఖపట్నం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నామ‌ని, మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. మేం కూట‌మిలో లేమ‌ని వెల్ల‌డించారు. నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్‌,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.

  • మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..
  • మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాం
  • రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • మేము మొదటి నుండి చెప్తున్నాం  జమిలి ఎన్నికలు వస్తాయని
  • జమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడుని
  • జేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుంది
  • జేపీసీకి పార్టీ వైఖరిని వైయ‌స్ జగన్ స్పష్టం చేస్తారు
  • విద్యుత్‌ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్‌ 
  • పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్  పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు
  • ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారు
  • అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారు
  • అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారు
  • వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం
  • వచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుంది
  • ఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు
  • సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు
  • నాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు
     
Back to Top