తాడేపల్లి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ, ఆయన శాశ్వత వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆయన శత జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఘన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి జీ భారతదేశాన్ని క్లిష్టమైన సమయాల్లో మార్గనిర్దేశం చేసిన గౌరవనీయమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 100వ జయంతి సందర్భంగా, వాజ్‌పేయి జీకి నివాళులు అర్పిస్తున్నాము, వారి శాశ్వత వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.