తాడేపల్లి: "లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకమని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు.