తిరుపతి : పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి(టీటీడీ) ఆలయానికి సీఎం చంద్రబాబు అప్రతిష్టను తెచ్చి పెట్టారని టీటీడీ మాజీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీలు లక్ష్మణ్ కుమార్, చందు తోటలు ఎవరో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రపై భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ పాలనలో టీటీడీ ప్రతిష్ఠ భ్రష్టు పట్టిపోయింది. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. వీళ్ళ అసమర్ధత కారణంగా తొక్కిసలాట జరిగింది. వీరి అలసత్వం కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ అనుచరులు లక్ష్మణ్ కుమార్, చందులు. అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అనేది ఉద్యోగస్తులే చెప్తున్నారు. ఎవరి లక్ష్మణ్ కుమార్, చందు తోట నిగ్గు తేల్చాలి. ఆర్టీఫిషల్ ఇంటిలిజెన్స్ పేరుతో సాఫ్ట్- వేర్ పేరుతో అనధికార వ్యక్తులు టీటీడీలో తిష్ట వేశారు. వెంకయ్య చౌదరినే ప్రధానంగా నిందితుడు. ఎలాంటి సంబంధం లేని జేఈవో గౌతమిపై వేటు చేశారు. దీనిపై నిజా నిజాలేంటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడే నిగ్గు తేల్చాలి. అడిషనల్ ఈవోను బదిలీ చేయాలి. టీటీడీలో బినామీల ముఠా కొండపై ఏమి చేస్తోంది. వేంకటేశ్వర స్వామిని స్వార్ధానికి వాడుకుంటున్నారు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. ఏ సంబంధం లేకపోయినా ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు క్షమాపణ చెబుతున్నాను’అని అనడం అభ్యతరకరం. హత్యలు, అత్యాచారాలు చేసి క్షమించాను అంటే కోర్టులు, జడ్జీలు వదిలి వేయరు కదా. ఆరు మంది చనిపోతే తొక్కిసలాటలో చనిపోయినట్లు తక్కువ సెక్షన్లు పెట్టారు. మీరు క్షమాపణలు చెప్పడంలో కుట్ర ఉంది, దోషులను శిక్షించాలి. అధికారులపై చర్యలు, అరెస్టు చేయాలి అని ఉండి ఉంటే బావుండేది. దోషులు పై చట్ట పరంగా జరిగిన సంఘటనకు చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షించే వారు’ అని అన్నారు.