వైయస్ఆర్ జిల్లా: ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన క్రిస్మస్ పర్వదినం మనందరికీ స్ఫూర్తినిస్తుందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మీకు చాలా హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు! ఆశ, శాంతి మరియు ప్రేమ పుట్టుకను జరుపుకుందాం. ఉజ్వల భవిష్యత్తు కోసం మానవాళికి సేవ చేసేందుకు క్రిస్మస్ మనందరికీ స్ఫూర్తినిస్తుంది అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం ఇచ్చారు.