కాసేపట్లో ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది.  పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. వేదవతి, తుంగభద్ర ప్రాజెక్టులపై ఆరా తీయనున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఈమూడున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు. 
 

Back to Top