<br/>న్యూఢిలీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రత్యేక హోదాపై పోరాటం చేయనుంది. మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో సోమవారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు.<br/> పార్లమెంట్ సమావేశాల్లో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ సర్కార్ నీరుగారుస్తున్న తీరు, తితిలీ తుపానులో నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక సాయం, సీబీఐ, ఈడీ వంటి సంస్ధలపై నిషేధం విధించి సమాఖ్య వ్యవస్థను చంద్రబాబు సర్కార్ ధిక్కరిస్తున్న వైనం, ఫిరాయింపుల చట్టం బలోపేతం, ఒకే దేశం-ఒకే ఓటు వంటి అంశాలను పార్లమెంట్ వేదికగా ఈ సమావేశాల్లో వైయస్ఆర్‌సీపీ ప్రధానంగా ప్రస్తావించనుంది. <br/>