<br/>తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో సోమవారం బీసీ అధ్యయన కమిటీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమనతో పాటు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. బీసీలపై నిజమైన ప్రేమ చూపింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన పేదల కోసం ఓ అడుగు వేస్తే, వైయస్ జగన్ రెండు అడుగులు వేయాలనే తపన ఉన్న వ్యక్తి అని తెలిపారు. బీసీ వర్గాల సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అధ్యయం చేస్తామన్నారు. బీసీ మేలు చేసే ప్రతి అడుగులో అడుగేస్తా అని హామీ ఇచ్చారు.