అన్యాయపు పాలనకు పతనం ప్రారంభం



– సుదీర్ఘ పోరాటం అనంతరం న్యాయం జరిగింది
– ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను
– చంద్రబాబు అన్యాయమైన పాలనకు పతనం ప్రారంభమైంది
– వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం 


 
విజయవాడ: మడకశిర ఎమ్మెల్యేగా తనతో ప్రమాణస్వీకారం చేయించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు అన్యాయమైన పాలనకు పతనం ప్రారంభమైందని, నా గెలుపే వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు నాంది అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  ఆలస్యమైనా న్యాయం జరిగిందని తెలిపారు. టీడీపీఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదని, వైయస్‌ఆర్‌సీపీ తరఫున మడకశిరలో పోటీ చేసిన తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించమని సుప్రీం కోర్టు కూడా ఆదేశించిందన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని చెప్పారు. ఏది ఏమైనా న్యాయం గెలిచిందని, సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పారు. మూడేళ్ల క్రితమే రావాల్సిన తీర్పు ఆలస్యమైందని, ఏది ఏమైనా ఈ తీర్పుతో వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడానికి ఇది నాంది పలికిందన్నారు. ఈ గెలుపుతో మా పార్టీకి మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేసి వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తెస్తామన్నారు.
వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారని విమర్శించారు. కోర్టులో ఫిర్యాదు చేసినా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. చంద్రబాబుకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదన్నారు. ఈ తీర్పుతో చంద్రబాబు అన్యాయమైన పాలనకు పతనం ప్రారంభమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ అడ్రస్‌ లేకుండా పోతుందన్నారు. నా గెలుపే నాందిగా తీసుకొని అత్యధిక సీట్లతో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. 
Back to Top