ఎమ‌ర్జెన్సీ త‌ర‌హా ప‌రిపాల‌న‌

కాకినాడ :  తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌రిపాల‌న‌ ఎమర్జెన్సీని తలపిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. జిల్లాలో కాపు సామాజిక వర్గంపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్న తీరును నియంత్రించాలని కోరుతూ జిల్లా కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
 
 అనంతరం కన్నబాబు కలెక్టరేట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ తుని ఘటనను, ముద్రగడ దీక్షను సాకుగా తీసుకుని  కాపు సామాజిక వర్గంపై అణచివేత ధోరణిలో దమన కాండ సాగిస్తున్న పోలీసులు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలకు దూరంగా ఉన్న నాయకులు, కాపు యువత ఇళ్ళకు కూడా వెళ్ళి సోదాలు చేస్తూ బలవంతంగా స్టేషన్లకు ఈడ్చుకువెళ్ళి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజార్టీ సామాజిక వర్గంగా ఉన్నకాపుల పట్ల ప్రభుత్వం ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఒకటి, రెండు శాతం ఉండే సామాజిక వర్గాల పట్ల ఈ ప్రభుత్వ అణచివేత ధోరణి మరెంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చునన్నారు.
Back to Top