పూల మొక్క‌ల‌పై `ప‌చ్చ‌` నేత‌ల ప్ర‌తాపం

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత బ‌తిపూల తోట‌ను ధ్వంసం చేసిన టీడీపీ మూక‌లు

పల్నాడు జిల్లా: అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాల‌కు అంతే లేకుండా పోయింది. ప్ర‌తిప‌క్ష నేత‌లే టార్గెట్‌గా ఇన్నాళ్లు దాడుల‌కు పాల్ప‌డిన టీడీపీ నేత‌లు.. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా పూల తోట‌లు, పండ్ల మొక్క‌ల‌పై కూడా వారి ప్ర‌తాపం చూపుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో మరోసారి  తెలుగుదేశం నాయకులు బ‌రితెగించారు. కారంపూడి మండలం చిన్న కొదమగుళ్ల లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మండల కన్వీనర్ సాగు చేసిన బంతి పూల తోటను టీడీపీ నాయ‌కులు ధ్వంసం చేశారు. రాత్రి పొలంలోని బంతిపూల మొక్కలు పీకేసి శునకానందం పొందారు. వైయ‌స్ఆర్‌సీపీలో మ‌హిళా నాయ‌కురాలు యాక్టివ్ ఉండ‌టంతో ఆమెపై కక్ష కట్టి  ఇలా బంతిపూల మొక్కలను పీకేశారు.

Back to Top