<strong>రేవేంద్రపాడు (గుంటూరు జిల్లా),</strong> 24 మార్చి 2013: శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారానికి 100వ రోజుకు చేరింది. శ్రీమతి షర్మిల ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని రేవేంద్రపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 100 రోజులు పూర్తైన సందర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు శ్రీమతి షర్మిలను అభినందించారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు కుట్రలపై అలుపెరుగని పోరాటానికి దిగిన శ్రీమతి షర్మిలకు మరింత శక్తినివ్వాలని వారంతా ఆశీర్వదించారు. రేవేంద్రపాడులో ఉన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. <br/><img src="/filemanager/php/../files/sarm24a.JPG" style="width:500px;height:577px;margin:5px;vertical-align:middle"/>రేవేంద్రపాడు నుంచి బయలుదేరిన శ్రీమతి షర్మిల పెదవడ్లపూడి మీదుగా పాదయాత్ర చేసి భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం ఆమె ఆత్మకూరు, గణపతినగర్, ద్వారకానగర్, వడ్లపూడి సెంటర్, మిద్దెసెంటర్ మీదుగా ఆర్టీసీ బస్‌స్టాండుకు చేరుకుంటారు. బస్‌స్టాండులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆమె కొత్తపేట మీదుగా ఆదివారం రాత్రి బసకు చేరుకుంటారు. ఆదివారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 13 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు.<br/>కాగా, శ్రీమతి షర్మిల మరో ప్రస్థానం పాదయాత్రకు మద్దతుగా వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన లంబాడీలు పెద్ద సంఖ్యలో తరలి గుంటూరు జిల్లాకు తరలి వచ్చారు. <br/>