తిరోగమనంలో విద్యారంగం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ

అమ‌రావ‌తి:  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విద్యారంగం తిరోగ‌మ‌నంలో సాగుతోంది. ఏపీలో సర్కార్ విద్యకి సీఎం చంద్రబాబు మంగళం పాడారని వైయ‌స్ఆర్‌సీపీ ఆక్షేపించింది.  దీపావళి కానుకగా పేదింటి బిడ్డల్ని నాణ్యమైన చదువుకి బాబు దూరం చేశారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టింది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో 'ఇంగ్లీషు మీడియం, CBSE, టోఫెల్ రద్దు, తల్లికి వందనమంటూ అమ్మఒడికి ఎగనామం పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్కి తిలోదకాలు. అధ్వాన్నంగా మారిన స్కూళ్లు, హాస్టళ్లలో కలుషిత ఆహారంతో విద్యార్థుల ఆస్పత్రిపాలు అవుతున్నారు. కూటమి 5 నెలల పాలనలో. తిరోగమనంలో విద్యారంగం' అని  వైయ‌స్ఆర్‌సీపీ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. 

వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో విప్ల‌వాత్మ‌క మార్పులు
చదువు అన్నది  తలరాతలు మార్చే ఒక ఆస్థి. మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్‌ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంద‌ని గ్ర‌హించిన నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌.. అందుకే త‌న ఐదేళ్ల పాల‌న‌లో  వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్‌ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా  విప్లవాత్మక అడుగులు వేశారు. 

 నాడు–నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న విద్యాకానుక కానీ, స్కూళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న తపన, తాపత్రయంతో వైయ‌స్ జ‌గ‌న్ అడుగులు వేశారు. జగనన్న గోరుముద్ద మీద ఫోకస్‌ పెట్టారు. పిల్లలు బాగా చదవాలి, పిల్లలను బడులకు పంపించేందుకు తల్లులను మోటివేట్‌ చేస్తూ.. వారి కోసం వైయ‌స్ఆర్‌  అమ్మఒడి కార్యక్రమం అమలు చేశారు. పిల్లలు ప్రపంచంతో పోటీపడాలని... ప్రభుత్వ బడులను  తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చి రూపురేఖలు మార్చారు. ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలకు పక్కపక్కనే ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగుతో  బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ద్వారా పిల్లలకు మెరుగైన చదువులు చెప్పించారు. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్‌ కంటెంట్‌ కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో రూ.15వేలు చెల్లిస్తే తప్ప అందుబాటులోకి రాదు. అలాంటి బైజూస్‌ కంటెంట్‌ను మన ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందించారు. 6వతరగతి ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్‌రూంలోనూ ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ఫాంలను ఏర్పాటు చేసి.. డిజిటల్‌ క్లాస్‌రూములగా మార్చి డిజిటల్‌ బోధన తీసుకొచ్చారు.

ప్రభుత్వ బడులలో 8వతరగతి వచ్చేసరికి ఆ  పిల్లలకు ట్యాబులు ఇచ్చారు. ఇలా ప్రతి అడుగు విప్లవాత్మక అడుగే. తెలుగుమీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు సీబీఎస్‌ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం కావచ్చు, పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్‌ ను సబ్జెక్ట్‌ గా తీసుకొచ్చారు. 

 
క్లాస్‌ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్‌ టీచర్‌ ను ఏర్పాటు చేశారు.  పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్‌ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపించింది. ఇవాళ అలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. 

Back to Top