చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను ఏటీఎంలా వినియోగిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అధికారంలోకి రావడం ఆలస్యం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్‌ నిధులను దారి మళ్లించడమే కాక ప్రాజెక్ట్‌కు చంద్ర గ్రహణం పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తును తగ్గిస్తే తాగు,సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

Back to Top