<strong>గుంటూరు, 9 మార్చి 2013:</strong> జననేత, వైయస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఆదివారం ఒక్క రోజు విరామం ప్రకటించారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ళ జరుగుతున్న సందర్భంగా ఈ ఒక్క రోజు పాదయాత్రకు విరామం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దానితో పాటు ఆదివారం శివరాత్రి పర్వదినం అయినందున పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఒక రోజు విరామం ఇవ్వాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుందని వారు వివరించారు.