ముఖ్య నేతలతో సమావేశం కానున్న వైయస్ జగన్

అమరావతి:

ప్రత్యేక హోదా, రా ష్ట్ర విభజన అంశాలసాధనపై పార్టీ తరపున తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం ఆదివారం సాయంత్రం జరగనుంది. నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి వద్ద పాదయాత్ర శిబిరం వద్ద పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు, రాజీనామాలు చేసిన అయిదు మంది లోక్‌సభ సభ్యులు, తనతో సహా తొమ్మిది మంది రీజనల్‌ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొననున్నారు.

Back to Top