<br/><strong>– చంద్రబాబు దుర్భుద్ధిని ప్రజలు గుర్తించారు</strong><strong>– రాష్ట్రపతి పాలన మేం కోరుకోలేదు </strong><strong>– వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ</strong>న్యూఢిల్లీ: హత్యాయత్నాన్ని డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, వాస్తవాలు దాడిచెట్టి అవాస్తవాలను ప్రచారం చేశారని, చంద్రబాబు దుర్భుద్ధిని ప్రజలు గుర్తించారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటనలో చంద్రబాబుకు, లోకేష్‌కు సంబంధం లేకుండా నిష్పక్షపాత విచారణకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఎయిర్ పోర్టు తమ పరిధిలో లేదని, సీఐఎస్‌ఎఫ్ పరిధిలో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పరిధిలో లేదు కాబట్టి థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని బొత్స డిమాండు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఇవాలే దించాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆలోచన మాకు లేదన్నారు. చంద్రబాబు చేస్తున్న దుర్భుద్ధికి ఇవే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు. ఉమ్మడి రాజధాని కావడం, అక్కడ మెరుగైన ఆసుపత్రులు ఉండటంతో వైయస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చి చికిత్సలు చేయించుకున్నారన్నారు. చంద్రబాబుకు, లోకేష్‌కు ఎలాంటి సంబంధం లేకుండా సీబీఐ విచారణకు ఎందుకు భయడపతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీ పోలీసు వ్యవస్థ తీరు సమంజసంగా లేదని , మాకు న్యాయం జరగాలంటే థర్డ్ పార్టీ విచారణ కావాలన్నారు. హత్యయత్నాన్ని డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. ఎన్ని కుట్రలు చేసిన వైయస్ జగన్ ప్రజల్లో ఉన్నారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.