ప్రొద్దుటూరును కుక్కలు చించిన విస్తరి చేశారువైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డివైయస్ఆర్ జిల్లా: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలు ఘోరి కడతారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్ జంగంపేట హనుమాన్ నగర్‌లో రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అదే విధంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ నాయకత్వంలో నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల కుమ్ములాటతో అభివృద్ధి అటకెక్కిందని మండిపడ్డారు. ప్రొద్దుటూరు పట్టణాన్ని కుక్కలు చించిన విస్తరిగా చేసి ఊరును భ్రష్టుపట్టించారన్నారు. ప్రజలను దుర్గంధపూరిత వాతావరణంలో ఉంచి అనారోగ్యాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కుమ్ములాట అమరావతికి చేరిందని, టీడీపీ నేతలు కొట్టుకోవడం చంద్రబాబు రాజీచేయడం ఇదే సరిపోతుందన్నారు. సిగ్గు, ఎగ్గు లేని పార్టీగా తెలుగుదేశం తయారైందన్నారు.