వైయస్‌ జగన్‌ రాజీ పడలేదు

 
ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజీపడ్డారన్నారు. వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. హోదా సాధనకు ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహించారని, గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేశారని తెలిపారు. 
 
Back to Top