<strong>విజయనగరంః</strong>యాజమాన్యాలు తమతో వెట్టిచాకిరి చేయించుకుంటుందని ప్రైవేటు టీచర్లు, లెక్చలర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి కలిసి తమ గోడును వినిపించారు.సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. ఉద్యోగభద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై చట్టం చేసేందుకు జగన్ హామీ ఇచ్చారని ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు టీచర్లు జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయన్నారు.హెల్త్‌కార్డులు కూడా లేవన్నారు.వేసవికాలంలో కూడా కాంపెయిన్ల పేరిట పనిచేయిస్తున్నారని వాపోయారు. యాజమన్యాలు కనీసం పిఎఫ్, ఈఎస్‌ఆర్ కూడా కల్పించడంలేదన్నారు. <br/>