చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి 21 ప్రశ్నలు..


రాష్ట్రప్రజలు ఈ 21 ప్రశ్నలకు మీ నుంచి సమాధానం కోరుకుంటున్నారు.

1.జగన్ నేరుగా ఎయిర్ పోర్ట్ నుండి ఆసుపత్రికి వెళ్ళాడు. అందుకు సాక్ష్యంగా అక్కడ 25 మీడియా చానల్స్ ఉన్నాయి(ఏబీఎన్ తో సహా). ఈ విషయాన్ని వక్రీకరించి జగన్ ముందు ఇంటికి వెళ్లాడని చంద్రబాబు అబద్దం చెప్పాల్సిన అవసరమేంటి?

2. నిందితుడు జగన్ కు సానుభూతి రావాలని హత్యాయత్నం చేసేవాడైతే "నేను చంద్రబాబు, టీడీపీ అభిమానిని, జగన్ ను చంపడానికి వచ్చా" అని చెబుతాడు గానీ నేను సానుభూతి రావాలనే చేశా అని ఎందుకు చెప్పాడు?

3. మామూలుగా ఆత్మహత్యచేసుకునేవాళ్ళు జేబులో లేఖ పెట్టుకుంటారు. మరి ఇతనేంటి హత్యాయత్నం చేసే ముందు జేబులో లేఖ పెట్టుకున్నాడు? అది కూడా 11 పేజీల లేఖ.

4. అతనికి మతిస్థిమితం లేదని ఏబీఎన్ రాధాకృష్ణ, మంత్రులు చెబుతున్నారు. ఒక మతిస్థిమితంలేని వ్యక్తికి టీడీపీకి చెందిన ఫ్యూషన్ ఫుడ్ క్యాంటీన్ ఓనర్ ఉద్యోగమిచ్చాడు. అదికూడా సంవత్సర కాలం నుండి ఎందుకు తన హోటల్ లో పెట్టుకున్నాడు ?

5. ఎంతో భద్రత ఉండాల్సిన విమానాశ్రయంలో ఘటన జరిగే చోట సీసీటీవీ కెమెరాలు ఎందుకు మాయమయ్యాయి?

6. తనిఖీ చేయకుండా గుండు పిన్ను కూడా పోలేనంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వీవీఐపీ లాంజ్ లోకి అటువంటి పదునైన కత్తి ఎలా వచ్చింది?

7. సంఘటన జరిగిన నిమిషాల్లోపల ఒక మార్ఫ్డ్ పోస్టర్ ను ఎల్లోమీడియా తెరమీదకు తెచ్చింది. ఆ పోస్టర్ పై వైయస్ఆర్ బొమ్మ గానీ, వైయస్ఆర్ సీపీ జెండా గానీ, స్థానిక నేతల ఫొటోలుగానీ, పార్టీ సింబల్ అయిన ఫ్యాన్ గానీ ఏమీ లేవు. గద్ద(గరుడ పక్షి) బొమ్మ మాత్రమే ఎందుకు ఉంది?

8. కూటికి గతిలేని, పూటగడవని వ్యక్తికి ఫ్లెక్సీ వేయించుకునేంత స్థోమత ఎక్కడిది?

9.ఫ్లెక్స్ పై ప్రింటింగ్ ప్రెస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ ఫ్లెక్స్ లో ఎలా మాయమైంది?

10.పదినెలల క్రితం ముద్రించారని చెబుతున్న ఫ్లెక్స్.. సంఘటన జరిగిన నిమిషాల్లోపల ఎలా వచ్చింది?

11.క్యాంటీన్లో పనిచేసే 10వ తరగతి మాత్రమే చదివిన ఒక వ్యక్తి 10పేజీల లేఖ.. అదికూడా తెలుగులో అంతటి ప్రావీణ్యంతో ఎలా రాయగలడు?

12. 11 పేజీలలో కొన్ని పేజీల చేతివ్రాతలకు, మరికొన్ని చేతివ్రాతలకు ఎక్కడా కనీస పొంతన లేదెందుకు?

13. అతను జేబులో లెటర్ పెట్టుకున్నాడని చెప్పారు. మనం జేబులో 10రూపాయల నోటు పెట్టుకున్నా కూడా మడతపెట్టి జేబులో పెట్టుకుంటాం. అటువంటిది ఆ లేఖ పేజీలు.. చిన్న మడత కూడా లేకుండా ఫ్రెష్ గా ఎలా ఉన్నాయి?

14. అతను జగన్ పై హత్యాయత్నం జరిపిన వెంటనే నన్ను అరెస్టు చేయమని చేతులెత్తాడు. చంద్రబాబు చెప్పినట్టు ఆడే ఏపీ పోలీసులైతే.. తనకు హై క్వాలిటీ స్టార్ హోటల్ ఇడ్లీలు పెట్టి, మర్యాదలు చేస్తారని అతనికి ముందే తెలుసా?

15. సంఘటన జరిగిన వెంటనే అక్కడకు వచ్చిన బొత్స సత్యనారాయణ సుమారు 5 గంటల పాటు ఎయిర్ పోర్ట్ లోనే ఉండి దాడి చేసిన వ్యక్తితో మాట్లాడాలని ప్రయత్నించారు. ఎన్ని సార్లు అడిగినా పోలీసులు అనుమతించలేదు. ఎందుకు ?

16. చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేనిచోటు.. అని చెబుతున్న విమానాశ్రయంలోపల.. సంఘటన జరిగేసమయంలో ఏపీ పోలీసులు ఎందుకు ఉన్నారు?

17. విమానాశ్రయంలో జరిగిన దానికి మా బాధ్యత లేదని చెబుతున్న ముఖ్యమంత్రి, ఏపీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని కంటికి రెప్పలా కాపాడుతూ ఇంటరాగేషన్ చేయకుండా మర్యాదలు చేస్తున్నారెందుకు?

18. డీజీపీ.. సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తూ నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని కుల సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇక్కడ కుల ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉందా? మర్డర్ ఎటెంప్ట్ చేసిన వ్యక్తికి రిజర్వేషన్ ఇచ్చి ఏమన్నా కాపాడుతారా? వైయస్ఆర్ సీపీకి ఏకపక్షంగా ఓట్లు వేసే ఎస్సీలకు, జగన్ కు మధ్య చిచ్చుపెట్టి వైయస్ఆర్ సీపీ ఓటుబ్యాంకును చీల్చే ప్రయత్నమా?

19.విచారించకుండా డీజీపీ ఏమీ మాట్లాడకూడదు. కానీ విచారణ జరగకుండానే ఘటన జరిగిన వెంటనే అతనిని జగన్ అభిమాని అని తేల్చేసాడు. రూల్ ప్రకారం విచారించకుండా జడ్జీలా తీర్పిచ్చే హక్కు డీజీపీకి ఉందా?

20. అన్నిటికన్నా రక్తికట్టిన నాటకం అతని అన్నది. ఇంటిల్లిపాదీ టీడీపీ అట అతని తమ్ముడు మాత్రం జగన్ వీరాభిమాని అట. 32పళ్ళు బయటపెట్టి.. ఏమాత్రం ఆందోళనలేకుండా హాయిగా మీడియాతో మాట్లాడాడు అతని అన్న. కొద్ది నెలల ముందు టీడీపీ అతని కుటుంబానికి శాంక్షన్ చేసిన ఇల్లు, లోన్ వల్లే అతనిలో పశ్చాత్తాపం లేదా? లేక ముఖ్యమంత్రి స్థాయిలో అతని కుటుంబానికి తన తమ్ముడికి అండ ఉందనా?

21.ఈ దాడి జరుగుతుందని ముందే చెప్పింది సినిమా యాక్టర్ శివాజీ చౌదరి. అతనిని అరెస్టు చేసి లై డిటెక్టర్ ద్వారా ఇంటరాగేషన్ చేస్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి. అతనికి అలా చెప్పిన వ్యక్తి ఎవరో తెలిస్తే ఈ నాటకమంతా బయటపడుతుంది కదా..! శివాజీ చౌదరిని విచారించే పని ఏపీ పోలీసులు ఇంతవరకూ చేయలేదు. ఎందుకు?

ఈ ఆపరేషన్ నడిపిస్తోంది చంద్రబాబేనా అని అనుమానాలు క‌ల‌గ‌క మాన‌వు ...
Back to Top