రాజకీయమా...నారాసురుమా

హుందాతనం లోపించింది. పొలిటికల్‌ సీనియారిటీ కనిపించకుండా పోయింది. దేశవిదేశ పర్యటనల విశేషానుభవం లేశమైంది. వై.ఎస్‌.జగన్‌పై జరిగిన దాడి విషయంలో ముఖ్యమంత్రి స్పందన తీరిది. దేశంలోనే తనను మించిన పొలిటీషియన్‌ లేడని, హుందా రాజకీయాలకు తానే పెట్టింది పేరని నిన్నటి ప్రెస్‌కాన్ఫరెన్స్‌లోనూ తనను తాను పరిచయం చేసుకున్న బాబుగారు...తన సహజ ధోరణిలోనే చెప్పే దొకటి, చేసేదొకటి తరహాలో ప్రవర్తించారు. తన స్థాయిని, వయసును మరిచిపోయి గుడ్లురిమారు. బిత్తర చూపులు చూశారు. వెకిలి నవ్వులూ నవ్వారు. వాటిని మాటున తన రాక్షసానందాన్ని స్పష్టంగా ప్రకటించారు.
సంఘటన జరిగినప్పట్నుంచి ఎంతో హుందాగా, నిబ్బరంగా వ్యవహరించిన వైయ‌స్ జగన్‌...రక్తసిక్తమైన షర్టుతో హంగామా చేయలేదు. వెంటనే మరో షర్టు వేసుకున్నాడు. అక్కడికి ఆగని రక్తం మరక కాసింత కనిపిస్తూనే వుంది. గాయం మాత్రం లోతుగా దిగింది. డాక్టర్లు చెప్పిన సత్యం. అసలు ఇంటికి వెళ్లకుండా...నేరుగా ఆస్పత్రికి వెళ్లినా...దానిపైనా చిల్లరమాటలు మాట్లాడటానికి జంకలేదు చంద్రబాబు. హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జగన్‌ ఇంటికి వెళ్లాడట. అక్కడ ఆయనకు ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చిందట. ఫోన్‌లో వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆస్పత్రికి వెళ్లి పడుకున్నాడట. పడుకున్న తీరుపైనా పెద్దమనిషి చంద్రబాబు ఎకసెక్కాలాడారు. గాయపడ్డ జగన్‌ను పరామర్శించిన ఇతర పార్టీనాయకులనూ ఖండించాడు. గవర్నర్‌ను ప్రశ్నించాడు. ఊరంతా ఒక దారయితే...ఉలిపిరి కట్టదొకదారన్నట్టు వ్యవహరించిన బాబుగారి మాటలు నిజంగా ఆలోచించేవారికెవరికైనా విస్తుపోయేలా చేస్తాయి. ఈయనకేమైందన్న ప్రశ్నను రేకెత్తిస్తాయి. మతిభ్రమించిందా? రాక్షస మనస్తత్వమా? అని నిలదీయాలనిపించకపోదు.
ఇక బాబుగారి తీరిలా వుంటే...ఆయనగారి అంతేవాసులదీ వేరే ఎలా వుంటుంది. సంఘటన జరిగిన వెంటనే ఆయనగారు మందను తోలినట్టు తన అనుచరులను మైకులముందుకు తోలాడు. ఆ మైకాసురులు బుద్దిజ్ఞానం పూర్తిగా లోపించినవారై, సంఘటనపై విచిత్రాతి విచిత్రంగా స్పందించారు. గాయపడ్డ జగన్‌పైనే నిందలు వేసే ప్రయత్నాలు చేశారు. తాము చేసే క్షుద్రరాజకీయాలను జగన్‌కు అంటగట్టాలని చూశారు. ఎంత వీలయితే అంతగా దిగజారి మాట్లాడటానికి మేం సిద్దమన్న తీరులో స్పందించారు. ఇంగిత జ్ఞానం లోపించిన వీళ్లా ప్రజలను పాలించేది అనిపించారు. 
ఇక జగన్‌గారు శుక్రవారం కోర్టు ప్రసక్తి లక్షాఒకటో సారి గుర్తుచేశారు. అసలు వీళ్లకు చిన్నమెదళ్లు చితికిపోయాయా? అనిపించకపోదు. ఆ కోర్టు పర్యటనలేవీ జగన్‌ రహస్యంగా చేయడం లేదు. చక్కగా విచారణకు సహకరిస్తున్నారు. చట్టాన్ని గౌరవిస్తున్నారు. కోర్టులపై నమ్మకాన్ని చూపుతున్నాడు. తను తప్పు చేయలేదన్న నమ్మకం వున్నవాడు. న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం వున్నవాడు జగన్‌. కేసులంటేనే ...స్టేలంటూ పరుగులు పెట్టే తెలుగుదేశాధీశుడిలా...ఆయన అంతేవాసుల్లాగా దొంగవ్యవహారాలకు దిగడం లేదు. పచ్చపార్టీ అధినాయకుడి నుంచి ఆయన పుత్రరత్నం నుంచి, పచ్చ చిన్నాపిల్ల నేతల వరకూ ’ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంట్‌’ అన్నట్టుగా...దొంగే దొంగన్నట్టు అరిచినట్టుగా వీరంగాలు వేస్తున్నారు. వెకిలితనంతో నవ్వుల పాలవుతున్నారు. 
ఇక నారాలోకేష్‌బాబుగారి ట్వీట్ల వికారమైతే అంతా ఇంతా కాదు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. వాటిని మరోసారి ప్రస్తావించడం కూడా సిగ్గుచేటైన విషయం. వైకాపా కోడికత్తి డ్రామా,  అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్‌మోడీరెడ్డికి కొత్తకాదు...అంటూ..ఎవరు కొట్టారో..చినబాబు పేరిట ట్వీటయ్యాయి. అసలు జగన్‌ పేరెతే అర్హతైనా తనకుందా? అన్న స్పృహలేనితనం. వారి చంకనెక్కి, వీరి చంకనెక్కి రాజకీయపబ్బం గడుపుకునే, కోతికొమ్మచ్చి రాజకీయాలాట ఆడేది ఆయనగారి తండ్రే. తండ్రి పాపం విపక్షనేతకు అంటగట్టే తెలివితేటలు తప్ప మరేవీ లేనట్టు..తన రాజకీయ అపరిణతిని అడుగడుగునా చాటుకుంటున్నాడు చినబాబు. పాపం విలువైన మాటలు, నిజాయితీ రాజకీయాలు తనకు తెలిస్తే కదా పెదబాబు నేర్పించడానికి, చినబాబు నేర్చుకోవడానికి.
వైజాగ్‌ ఎయిర్‌పోర్టు దాడి తర్వాత జగన్‌ హుందాగానే స్పందించాడు. నిలకడతనాన్నే చూపాడు. నిబ్బరంగానే వున్నాడు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న పెద్దరికాన్నే చూపాడు. ఇంచుల కొద్దీ కత్తి లోపలికి దిగినా, ఇసుమంతయినా నారావారు ప్రదర్శించే నాటకాభినయాన్ని కాసింతయిన చూపలేకపోయాడు. డ్రామా యాక్టర్లలాంటి పాలకపార్టీవారికి ...మనిషిగా నడిచే, మనిషిగా కదిలే, మనిషిగా స్పందించే....ప్రజలకోసం ఎందాకైనా అనే వ్యక్తిత్వం ఎప్పటికీ అర్థం కాని విషయమే. 
దేవుడా! రక్షించు... నా రాష్ట్రాన్ని....
నీతులు చెప్పే రెండునాల్కల పచ్చనేతల నుంచి
దేవుడా! రక్షించు...తమను తాము స్వచ్చమైనవారని ప్రకటించుకునే పచ్చ గొంగళీపురుగుల నుంచి...
దేవుడా! రక్షించు....పరిశుద్దాత్మల్లా మాట్లాడే రాక్షగణాల నుంచి...
దేవుడా! రక్షించు ..రాజకీయ ముసుగేసుకున్న నక్కలు, తోడేళ్ల నుంచి..
దేవుడా ! రక్షించు...మానవత్వం మరిచిన సంకుచిత రాజకీయ తిమింగలాల నుంచి
Back to Top