కర్నూలు : సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయనను పలువురు కలిసి తమ బాధలు చెప్పుకోవడంతో సీఎం చలించిపోయారు. తక్షణ సాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.సృజనకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె తన కార్యాలయంలో ఆరుగురు బాధితులకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు. అలాగే సీఎంను ఉద్యోగాలు అడిగిన వారికి ఉపాధి కల్పన అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన బాధితుల వివరాలు ♦ కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన యు.అశోక్ ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ♦ గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామానికి చెందిన కురువ రాజు కుమార్తె అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ♦ ఎమ్మిగనూరుకు చెందిన షేక్ రేష్మకు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా రెండు కళ్లు కోల్పోయింది. ♦ ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన బి.భాస్కర్ కుడి కాలు ఆపరేషన్ చేయించుకుని ఆరి్థకంగా చితికిపోయారు. ♦ గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన డి.ఖాజావలి ఆరేళ్లుగా కిడ్నీ, యూరిన్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్నారు. ♦ ఎమ్మిగనూరుకు చెందిన గొల్ల లక్ష్మన్న కుమార్తె శ్రావణి మానసిక జబ్బుతో బాధపడుతోంది.