బూతులు తిడుతూ నీతులు..

వైఎస్‌ జగన్‌ సహా అందరిపైనా పచ్చ పరివారం బండ బూతులు

ఎన్నికల సభల్లో స్థాయి మరిచి చెప్పలేని విధంగా చంద్రబాబు దుర్భాషలు

సంక్షేమ పథకాలు ‘మీ తల్లి మొగుడిచ్చాడా.. మీ నానమ్మ మొగుడిచ్చాడా..’ అంటూ పచ్చి బూతులు

అంగళ్లు సభలో.. ‘నాకొడకల్లారా’ అంటూ కార్యకర్తల్ని రెచ్చగొట్టిన బాబు.. విచక్షణ మరిచి అసభ్యంగా దూషించడంలో లోకేశ్‌కు సరిలేరెవ్వరూ..! 

పవన్‌ కళ్యాణ్‌ అసభ్య వ్యాఖ్యలకైతే లెక్కే లేదు

కొడకల్లారా.. బట్టలూడదీసి వీధుల్లో తిప్పుతా.. అంటూ పవన్‌ దూషణల పర్వం

నాడు సీఎంగా ఉన్న జగన్‌ను సైకో నాకొడుకు.. అంటూ దుర్భాషలాడిన అయ్యన్న నేడు స్పీకర్‌

బూతులపై పేటెంట్‌ రైట్‌ ఉన్న ఏకైక నేత దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని

అసభ్యకరమైన భాషకు పెట్టింది పేరు ఇప్పటి హోం మినిస్టర్‌ అనిత 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శృతిమించి టీడీపీ నేతల తిట్ల దండకం..

పోసాని బూతులు తిట్టారంటూ ఇప్పుడు అక్రమ కేసులతో అరెస్టు

తాము దూషిస్తూ.. ఎదుటి వారు తిడుతున్నట్లు బురద జల్లడం చంద్రబాబు, టీడీపీ నేతల నైజం

అమరావతి: పాల బూతులు.. పోలింగ్‌ బూతుల గురించి మాత్రమే తెలిసిన రాష్ట్ర ప్రజలకు రాజకీయాల్లో పచ్చి బూతులను పరిచయం చేసిన పార్టీ టీడీపీనే! ప్రత్యర్థి నేతలను నోటికొచ్చినట్లు నానా దుర్భాషలాడటం నేర్పింది పచ్చ ముఠాలే! నీతి చంద్రికలు వల్లిస్తూ ఆచరణలో మాత్రం బూతు చంద్రికను అనుసరించింది బాబు పరివారమే!! తాను తప్పుడు పనులు చేస్తూ.. వాటిని ప్రత్యర్థులు చేస్తున్నట్లు ప్రజల్ని మాయ చేయడం చంద్రబాబు నైజం! 40 ఏళ్లుగా ఆయన చేస్తున్న రాజకీయం అదే! అధినేత బాటలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్‌ సైనికులు ఆరితేరిపోయారు. 

చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు లోకేశ్, పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్, టీడీపీ నేతల దాకా.. వైఎస్‌ జగన్‌ను, ఆయన సతీమణిని, వైఎస్సార్‌ సీపీని, పార్టీ నేతలను నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూనే ఉంటారు. పచ్చి బూతులు, అసభ్యక­రమైన తిట్లు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలన్నింటినీ వారే చేసి.. వైఎస్సార్‌సీపీ నేతలు బూతులు మాట్లాడతారని, ఆ పార్టీ బూతుల పార్టీ అని దుష్ప్రచారం చేస్తారు. అదే నిజమనుకునేలా ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తమ వాదనే నిజమన్నట్లు.. బూతులు తిట్టారంటూ ఇష్టాను­సారంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 

తాజాగా ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబా­బును, మంత్రి లోకేశ్‌ను, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను తిట్టారంటూ అక్రమ కేసులు మోపి అరెస్టు చేశారు. నిజానికి ప్రత్యర్థులను దుర్భాష­లాడటం, బూతులు తిట్టడంలో టీడీపీకి మరే రాజ­కీయ పార్టీ సాటి రాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నాడు సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌నుద్దేశించి ‘సైకోగాడు..! వాడు, వీడు..! నా కొడుకులు..!’ అంటూ కొన్ని వందల సార్లు అనరాని మాటల­నడం రాష్ట్రమంతా చూసింది. 

ఇక ఎన్నికల సభల్లో ఆయన చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, మాట్లాడిన బూతులు, తిట్లకు అంతే లేదు. ఆయన పార్ట్‌నర్, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌.. చంద్రబాబును మించిపోయి బూతు ప్రసంగాలతో తన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే­వారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను ఏకవచనంతో సంబో«ధిస్తూ.. ‘వైఎస్సార్‌సీపీ నా కొడుకుల చర్మం ఒలుస్తా..! తోలు తీస్తా..! నార తీస్తా..! తొక్కిపెడతా...!’ అంటూ ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడిన అసభ్య మాటలు రాష్ట్ర ప్రజల మదిలో ఇంకా మెదులు­తూనే ఉన్నాయి. 

ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి సర్వసంగ పరిత్యాగిలా మారిపోయినట్లు నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ గతంలో చేసిన బూతు ప్రసంగాలు ఆయన సభ్యతను, సంస్కారాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌.. సీఎంగా ఉన్న జగన్‌ను సైకో అంటూ తరచూ దూషించేవారు. లోకేశ్‌ పాదయాత్రలో బ్లేడ్‌బ్యాచ్‌ స్థాయిలో వైఎస్సార్‌సీపీ నేతల్ని బూతులు తిట్టేవారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పుడు మారిన మనిషిలా నీతి వచనాలు పలుకుతున్నా ప్రతిపక్షంలో ఉన్న­ప్పు­డు మహిళా అధికారిని కూడా బట్టలూడ­దీ­స్తా­నని బెదిరించిన విషయాన్ని ఎవరూ మరచి­పో­లేరు. 

అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను, మహానాడు వేదికపై నుంచే చంద్రబాబు పక్కనుండగానే ‘సైకో నా కొడుకు’, ‘చెత్త నా కొడుకు’ అంటూ నోటికొచ్చి­­నట్లు తిట్టిన వ్యక్తి అయ్యన్న. ఆయన నోరు తెరిస్తే బూతుల వరదే. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బండ బూతులకు పేటెంట్‌ హక్కు తీసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా.. ఏ వేదికైనా.. ఏ కార్యక్రమమైనా ఆయన నోటి వెంట ముందుగా వచ్చేది బూతే. ఇటీవలే తన కారుకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కారు అడ్డుగా ఉందని డ్రైవర్‌ను ‘ముం.. కొడక..!’ అంటూ రాయలేని విధంగా తిట్టిన వీడియో వైరల్‌ అయింది. 

నాడు సీఎంగా ఉన్న జగన్‌ను ‘బోషడికే’ అని దూషించిన కొమ్మారెడ్డి పట్టాభికి చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. జగన్‌ను ఎంత తిడితే అంత ప్రోత్సాహం ఉంటుందని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు మాట నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చాక అలాంటి నేతలందరికీ పదవులు వడ్డించారు! స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వటాన్ని బట్టి చంద్రబాబు నైజం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలకు ముందు పలు సభల్లో..
1. డైమండ్‌ రాణి రోజా కూడా నన్ను తిడుతుంది. నువ్వు కూడానా..! ఇక ఏమనుకోవాలి.
2. కాకినాడ సభలో జనసేన వచ్చిన రోజున బట్టలూడతీసి కాకినాడలో గల్లీ గల్లీ.. సందు సందు తిప్పిస్తా. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి. లెక్కపెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావ్‌. వీధి వీధి తన్ని తీసుకెళతా. చెమడాలు ఒలుస్తా..!’
3. జనసేన ఆఫీసులో తమాషాగా ఉందా కొడకల్లారా.. ప్యాకేజీ గీకేజి అంటే (చెప్పు చూపిస్తూ..) పళ్లు రాలగొడతా.. అరేయ్‌ వెధవల్లారా.. సన్నాసుల్లారా. చవటల్లారా.. దద్దమ్మల్లారా.. ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా’ 
4. ‘నేను సై.. రా.. ఈరోజు నుంచి.. కొడకల్లారా.. గుర్తుపెట్టుకోండి.. చెప్పండ్రా.. రాడ్లా.. హాకీ స్టిక్కులా.. రాళ్లా.. ఒట్టి చేతులా.. దేనికైనా రెడీ.. ఛాలెంజ్‌ విసురుతున్నా రండ్రా కొడకల్లారా..!’ 

టీడీపీ ఆఫీసులో పట్టాభి బరితెగింపు
తాడేపల్లి ప్యాలెస్‌ దద్దమ్మకు చెబుతున్నా... అరె బోసిడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఇవ్వు నోటీసులు... తమిళనాడు, యూపీ పోలీసులకు ఇవ్వురా నోటీసు..

అయ్యన్నపాత్రుడి విద్వేష వ్యాఖ్యలు..
1. ‘జగన్‌ ఓడిపోయాడు కానీ చావలేదు... చచ్చేదాకా కొట్టాలి’ 
2. మహానాడులో : ‘ముఖ్యమంత్రి సైకో నాకొడుకు.. చెత్తపై పన్ను వేసే వాడిని చెత్త నాకొడుకు అని కాకుండా ఏమనాలి’ 

యువగళం సభలో అచ్చెన్నాయుడు..
‘తాట తీసి.. తోలు వలుస్తాం.. కొంతమంది పోలీసు అధికారులున్నారు. ఎస్పీని అడిగితే 500 మందిని బందోబస్తు కోసం ఇచ్చామన్నారు. ఎందుకు వచ్చారు. దెం.. తినడానికి వచ్చారా?’

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాబు బూతులు..
1. ఎన్నికల సభలో..
సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదంటూ.. ‘నీ తల్లి మొగుడిచ్చాడా..! మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా..! మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా..! మీ జేజి తాత మొగుడిచ్చాడా..! ఎవడిచ్చాడు..?’ అంటూ అసభ్య వ్యాఖ్యలు.

2. మంగళగిరి మీడియా సమావేశంలో 
‘ఒక సైకో ముఖ్యమంత్రి, పిచ్చోడు ముఖ్యమంత్రి, ఇష్టానుసారం చేస్తున్నాడు’

3. విశాఖలో 
‘ఈ రెండేళ్లలో ఏం చేశారు మీరు. గడ్డి పీకారా.. పిచ్చి కుక్కల్లా తిరుగుతూనే ఉన్నారు’

4. రాజానగరంలో..
‘ఇక్కడ ఉండే సైకోకి చెబుతున్నా.. ఖబడ్డార్‌.. అణగదొక్కుతా.. తిరిగి లేవలేరు.. చిత్తు చిత్తుగా చితక్కొడతా’

5. గుంటూరులో  
‘ప్రజలకు రోషం లేదు.. మీకు బుద్ధుందా.. సిగ్గుందా.. రాజధాని గురించి మాట్లాడడంలేదు. కుర్రాళ్లంతా స్వార్థపరులైపోయారు. చేవ చచ్చిపోయారు’

6. కాళహస్తి సభలో 
‘ముఖ్యమంత్రి గాల్లో వస్తాడు.. గాల్లో పోతాడు.. గిరా గిరా తిరుగుతాడు. ఎప్పుడో కిందపడి పోతాడు. శాశ్వతంగా ఫినిష్‌ అయిపోతాడు. గుర్తు పెట్టుకో జగన్‌రెడ్డి..!’

7. ప్రచార సభలో  
‘పీక్కోమన్నా ఆరోజే.. ఏం పీక్కున్నారో నాకే తెలియదు’

8. అంగళ్లు సభలో 
‘వాణ్ణి పట్టుకోరా.. తన్ను వాణ్ణి.. తరమండి నా కొడుకుల్ని..  చేతగాని దద్దమ్మల్లారా, పనికిమాలిన వ్యక్తుల్లారా.. దరిద్రుల్లారా..!’

9. టీడీపీ కార్యాలయంలో.. 
‘ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏకగ్రీవం అవుతాయా.. వీడేం పెద్ద పోటుగాడా ముఖ్యమంత్రి.. ఫేక్‌ ముఖ్యమంత్రి.. గాలి ముఖ్యమంత్రి’

లోకేశ్‌ దుర్భాషలు..
1. చంద్రబాబు అరెస్టు సమయంలో  
‘సిగ్గుందా నీకు.. సైకో జగన్‌ చెప్పాడా.. లండన్‌ నుంచి ఫోన్‌ చేశాడా.. ముండలను మింగడానికెళ్లాడా అక్కడికి..’ (పోలీసులనుద్దేశించి)

2. కాళహస్తిలో 
‘వాళ్ల పార్టీ ఆఫీసులను 
వంద పగలదెం.. వాళ్లను కడ్రాయర్లతో ఊరేగింపు చేస్తాం’ 

3. వైఎస్సార్‌ జిల్లా..
‘పోలీసులతో గొడవ పెట్టుకుని ఫ్లెక్సీలను చించిపాడి దెం...!’

4.పాదయాత్రలో
‘సన్న బియ్యం సన్నాసిని కట్‌ డ్రాయర్‌తో గుడివాడలో ఊరేగిస్తా.. ఉచ్చబోయిస్తా..’

5. సభలో 
‘మైకు లాగేసుకున్నాడు. చేతగాని నాకొడుకు జగన్‌మోహన్‌రెడ్డి..!’

6. సభలో 
‘ఏం పీకలేడు... జగన్‌ తాతే పీకలేదు.. అతని తండ్రే పీకలేకపోయాడు... మా వెంట్రుక కూడా పీకలేడు’

2018లో ధర్మ­పోరాట దీక్షలో బాలకృష్ణ బూతులు 
రాజ్యాంగంతోపాటు నీ(మోదీ) భార్యను గౌర­వించడం నేర్చుకో.. బీజేపీ, వైఎస్సార్‌సీపీలు కొజ్జాల్లాగా సీట్లు గెలవాలనుకుంటున్నాయి. 

Back to Top