తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరికొందరిని నియమించారు. 1. పార్టీ ప్రధాన కార్యదర్శులు (సమన్వయం)గా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని నియమించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి (అనుబంధ విభాగాలు)గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. 2. అలాగే కొన్ని అనుబంధ విభాగాలకు కూడా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నియామకాలు చేశారు. వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను నియమించారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబును నియమించారు. చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. 3. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు. టెక్కలి అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా పేరాడ తిలక్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్‌ను వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి నియమించారు. నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలను పేరాడ తిలక్ సమన్వయ పరుస్తారని పేర్కొన్నారు.