టీడీపీ అఫిషియ‌ల్ సోష‌ల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ రెడ్డి

తాడేప‌ల్లి: తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. 2022లో విజయమ్మ  కారు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారే..  
చంద్ర‌బాబూ నీ సొంత చెల్లెలను తిరుపతిలో యాక్సిడెంట్  చేపించింది నువ్వేనా? మీ బామర్ధి నందమూరి హరికృష్ణ గారు బ్ర‌తికుంటే నీకు ఎప్పుడైనా ఇబ్బందే అనుకుని నువ్వే కార్ యాక్సిడెంట్ చేపించి చంపించావా? నంద‌మూరి హ‌రికృష్ణ కొడుకు నంద‌మూరి జాన‌కీరామ్‌ గారిని కూడా నువ్వే యాక్సిడెంట్ చేపించి చంపించావా? జూనియ‌ర్ ఎన్టీఆర్‌ గారిని కార్ యాక్సిడెంట్‌లో చంపాల‌నుకున్నావా? అంటూ ప్ర‌శ్నించారు. హామీలు అమలు చేసే దమ్ములేక వైయస్ జగన్  పేరు చెప్తూ కాలయాపన చేయడానికి  సిగ్గులేదా చంద్రబాబు?  అంటూ పుత్తా శివశంకర్ రెడ్డి నిల‌దీశారు.

Back to Top