ప్ర‌జా ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

కర్నూలు జిల్లా:  యురేనియం తవ్వకాలకు వ్య‌తిరేకంగా క‌ప్పట్రాళ్ల  గ్రామ‌స్తులు చేప‌ట్టిన ప్ర‌జా ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుగా నిలిచింది. గ్రామస్తుల‌ నిరసనలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరుపాక్షి పాల్గొని సంఘీభావం తెలిపారు.
మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో బళ్లారి-కర్నూలు రహదారిపై  రాకపోకలు  నిలిచిపోయాయి​. 

Back to Top