కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది..చెప్పుకుంటే ఒక చరిత్ర అవుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ ఎవరు అని ప్రశ్నించిన పవన్ వ్యాఖ్యలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం వైయస్ జగన్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదన్నారు. వైయస్ జగన్ కంటే రెండేళ్లు పెద్ద వయసు ఉన్న పవన్ తన స్థాయి కూడా జగన్ మాదిరినే ఉంటుందని పోల్చుకుంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్ మార్చుకుంటే బాగుంటుంది. పవన్ ఆయన ఏంటో ఫ్రూవ్ చేసుకొని వైయస్ జగన్‌నే కాదు..మోదీని, ఇంకా పెద్ద పెద్ద లీడర్లను విమర్శించవచ్చు అన్నారు. వైయస్ జగన్ అనే వ్యక్తి ఒక ఫ్రూవ్‌డ్ లీడర్..మళ్లీ కొత్తగా ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిరూపించుకోవాల్సిన పని లేదు. వైయస్ జగన్ రెండుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, సొంతంగా పార్టీ పెట్టిన అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రంలో కొన్ని వేల మందిని నాయకులనుగా, ప్రజాప్రతినిధులుగా తయారు చేశారు. వైయస్ జగన్ గురించి చెప్పడానికి పెద్ద లిస్టు ఉంది. పవన్ ఏం చేశారో చెప్పడానికి ఏమీ లేదన్నారు. వైయస్ జగన్ సాధించింది చెప్పుకోవడానికి పెద్ద లిస్టు ఉందన్నారు. రాస్తే ఒక పుస్తకం అవుతుంది..చెప్పుకుంటే ఒక చరిత్ర అవుతుంది. పవన్ గురించి చెప్పుకోవాలంటే ఏముంది? . 2014లో ఇద్దరితో పొత్తు పెట్టుకున్నాడు. 2019లో నలుగురితో పొత్తు పెట్టుకున్నాడు. 2024లో ఎవరి కోసం పొత్తు పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాడు. ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా పవన్ ప్రజలకు చేసింది ఏముంది? అని ప్రశ్నించారు. వైయస్ జగన్ గురించి చెప్పుకోవాలంటే రాజకీయం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని రంగాలను ప్రక్షాళన చేశారు. వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆర్థికసాయం చేశారు. స్కూళ్లు నడిపారు. 28 ఏళ్లకే రాష్ట్రంలోనే ఒక పేరున్న వ్యాపారవేత్తగా వైయస్ జగన్ పేరు తెచ్చుకున్నారు. పవన్ వైయస్ జగన్‌ను ప్రశ్నిస్తున్నారు కదా..హూ ఈజ్ ఈ అని పవన్ ప్రశ్నిస్తున్నారు కదా? ..ఏమి చేశాడని ప్రశ్నిస్తున్నాడు కదా?. వైయస్ జగన్ ఏం చేశారో అందరికి తెలుసు. ఆయన ఫ్రూవ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సొంతంగా వెళ్లి ఇది నా పార్టీ..ఇది నా మేనిఫెస్టో..ఇది నా ఎజెండా అని చెబితే ప్రజలు నిన్ను విశ్వసిస్తారేమో కానీ, చంద్రబాబును పొద్దునే కలుస్తావు..చంద్రబాబు దొంగ అని చెప్పింది పవనే..టీడీపీ ఒక పనికి మాలిన పార్టీ అని విమర్శించింది పవనే..అటువంటి పవన్ ఈ రోజు ఏం చూసి మంచి అంటున్నారో చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.