అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మ బంధువయ్యారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధిలో పెద్ద పీట వేస్తూ అపారమైన ప్రేమను చాటుతున్నారు. నామినేటేడ్ పదవులు, పనుల్లో సగభాగం స్థానం కల్పిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఎన్నిలకు ముందు ఏలూరులో నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ బీసీ గర్జనలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హామీల అమలుపై చర్యలు తీసుకుంటున్నారు. బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పేదవాడి సంక్షేమం కోసం దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఒక్క అడుగు ముందుకువేస్తే.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకేస్తున్నారు. మీ పిల్లలను కలెక్టర్, డాక్టర్, ఇంజినీర్ ఏదైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తానని మాట ఇచ్చారు. హాస్టల్‌లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20వేలు ఇస్తామని నాడు పాదయాత్రలో చెప్పాడు. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం’ అని అప్పట్లో భరోసా ఇచ్చాడు. అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం నామినేటేడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. షాపులున్న ప్రతి నాయి బ్రాహ్మణులకు ఉచితంగా ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఆ దిశగా చర్యలు చేపట్టారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ నెలలో వైయస్‌ఆర్ నేతన్న నేస్తం అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. బాబు చేసిందేంటి? ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు బీసీలకు చేసిందేమిటి?. బీసీలకు ప్రతి ఏడాది రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. గత ఐదేళ్లలో రూ. 60వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన రూ.1300 కోట్లను చంద్రబాబు వేరే అవసరాలకు వాడుకున్నారు. ఇప్పుడేమో భవన నిర్మాణ కార్మికులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? Read Also: ఎన్టీఆర్, పవన్‌లను మించిన నటుడు చంద్రబాబు