గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ జీవో 29 పేరిట ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు!. ఏపీలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 29పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. "తల్లికి వందనం" పై విడుదలయిన GO MS No..29 పై ఎందుకింత మోసం చేసారు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యమే ఎవ్వరికీ లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ..మీరైనా సమాధానం చెప్తారా? అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.