టీటీడీ లడ్డూపై ఆరోపణల్లో నిజాలు నిగ్గుతేల్చాలి

అందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు అవసరం

తేల్చి చెప్పిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

తిరుమల లడ్డూపై చంద్రబాబు దారుణ ఆరోపణ

డీఐజీతో విచారణకు సీఎం నిర్ణయం హాస్యాస్పదం 

దానిపై ‘సిట్‌’ దర్యాప్తు ఏ మాత్రం సరి కాదు

దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలో విచారణ చేయాలి

మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

వైవీ సుబ్బారెడ్డి సతీమణిపై బాబు విమర్శలు అర్థరహితం

తల్లి, తండ్రి మరణిస్తే బాబు కనీస ఆచారం పాటించలేదు

ఆచారం ప్రకారం తలనీలాలు కూడా సమర్పించ లేదు 

అలాంటి చంద్రబాబు హిందూ ధర్మంపై మాట్లాడుతున్నారు

అంబటి రాంబాబు ఆక్షేపణ

పవన్‌కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష ఉద్దే«శం ఏమిటి?.

టీడీపీ హయాంలో విజయవాడలో గుళ్లు కూల్చారు

మున్సిపల్‌ తొట్టెల్లో దేవతా విగ్రహాలు తరలించారు

ఆనాడు సనాతన ధర్మం మీద మీ ప్రేమ ఏమైంది?

దళిత ప్రొఫెసర్‌పై దాడి చేసిన నీ ఎమ్మెల్యేపై కేసు ఏది?

నీకూ, నీ ఎమ్మెల్యేలకు వేరుగా కొత్త చట్టం ఉందా?

లేక ఇలా ప్రాయశ్చితం చేసుకుంటే కేసులుండవా?

ప్రెస్‌మీట్‌లో పవన్‌ను నిలదీసిన అంబటి రాంబాబు

గుంటూరు:    తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజాలు నిగ్గు తేలాలని, అందుకోసం అత్యున్నతస్థాయి దర్యాప్తు అవసరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. స్వయంగా ఆరోపణ చేసిన చంద్రబాబు, తన కింద పని చేసే డీఐజీ స్దాయి అధికారితో (ప్రత్యేక దర్యాప్తు బృందం–సిట్‌) విచారణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. దానిపై సిట్‌ దర్యాప్తు ఏ మాత్రం సరికాదన్న ఆయన, దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఆ ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు. 
    రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న డీఐజీ.. తన నివేదికలో కరుణాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తప్పు చేశారని, అందువల్ల వారిని ఉరి తీయాలని చెప్పడం మినహా కొత్తగా ఏం చెబుతారని అంబటి ప్రశ్నించారు. అందుకు బదులుగా మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేస్తే మీకు (చంద్రబాబు) మరింత సులభంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. అంత పెద్ద ఆరోపణ చేసిన చంద్రబాబు, తన ప్రభుత్వంలో పని చేస్తున్న పోలీసు అధికారితో విచారణ జరిపిస్తానన్నప్పుడే.. తన ఆరోపణలు అసత్యమని, అందులో పస లేదని తేలిపోయిందని గుర్తు చేశారు. గుంటూరులోని క్యాంప్‌ ఆఫీస్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

    తిరుమల ప్రసాదం అపవిత్రమైంది కాబట్టి, దానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతియాగం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం..  ఎక్కడ అపవిత్రం అయింది?. అసలు కల్తీ నెయ్యి వాడారా? అంటే సమాధానం చెప్పడం లేదని గుర్తు చేశారు.
    టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సతీమణి చేతిలో బైబిల్‌ పట్టుకు తిరుగుతారని చెప్పడం ద్వారా మతఘర్షణలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. గోపూజ చేస్తే తప్ప గడప దాటనంత సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ఆమెపైనా చంద్రబాబు నిందలు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  
    అలాగే నాడు ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే హిందూ ధర్మం ప్రకారం 11 రోజులు గుడికి రాకూడదని.. అయినా ఆయన వచ్చారన్న బాబు మాటలపైనా అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు పూరై్తన తర్వాతే ధర్మారెడ్డి తిరిగి విధుల్లో చేరారని తెలిపారు.
నిజం చెప్పాలంటే తన తండ్రి, తల్లి మరణిస్తే పెద్ద కుమారుడుగా కనీసం తలనీలాలు కూడా సమర్పించని చంద్రబాబు హిందూ సంప్రదాయం గురించి ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారని నిలదీశారు. 
    పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష ఉద్దే«శం ఏమిటన్న మాజీ మంత్రి, గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం తయారీలో తప్పు జరిగిందని నిరూపిస్తే.. తాము ప్రాయశ్చిత్తం చేసుకుంటామని చెప్పారు. అదే విధంగా సంప్రోక్షణ పేరుతో పవన్‌ కనకదుర్గ అమ్మవారి గుడి మెట్లు శుభ్రం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన అంబటి, మేం తప్పు చేశామనుకుంటే.. మీరెందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిలదీశారు. లడ్డూ ప్రసాదాల తయారీలో మేం తప్పు చేశామని నిరూపిస్తే.. నీ బూట్లు తుడిచే కార్యక్రమం చేస్తామని ప్రకటించారు.
    వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు నష్టం జరుగుతుంటే ఆ పార్టీలో ఉన్న హైందువులు పట్టించుకోలేదన్న పవన్‌ వ్యాఖ్యలపైనా మాజీ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో రోడ్డు కిరువైపులా ఉన్న అనేక దేవాలయాలను కూల్చేసి, వాటిలోని దైవ స్వరూపాలను మున్సిపల్‌ తొట్టెల్లో తీసుకెళ్లిన ఘటన గుర్తు చేశారు. మరి హిందూ సనాతన ధర్మంపై ఆరోజు ప్రేమ ఏమైందని నిలదీశారు.
    తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్‌  భూమన కరుణారెడ్డి హైడ్రామా క్రియేట్‌ చేశారన్న పవన్‌ వ్యాఖ్యలను తప్పు బట్టిన, అంబటి.. అసలు ఎవరు హైడ్రామా చేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుందంటూ..
    కెమెరాల సాక్షిగా, కనకదుర్మ అమ్మవారి ఆలయం వద్ద డిప్యూటీ సీఎం చేసిన హడావుడి వీడియో ప్రదర్శించారు. 
    టీటీడీ లడ్డూల తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ కోరితే దానికి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు అంగీకరించడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. అలాగే సీనియర్‌ యాక్టర్‌ ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడిన దాంట్లో తప్పేముందని నిలదీశారు.
    దళిత ప్రొఫెసర్‌ను దూషించి, కొట్టిన కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ.. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే కేసులుండవన్న కొత్త చట్టాన్ని పవన్‌ తీసుకొచ్చారని మండిపడ్డారు. 11 రోజులు ప్రాయశ్చిత దీక్ష అంటూ, సినిమా షూటింగ్‌లో పాల్గొనడాన్ని ప్రస్తావించిన ఆయన, దాన్ని తన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
    మొత్తంమీద తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయంగా వాడుకోవాలన్న చూస్తున్న చంద్రబాబు, అందుకు భవిష్యత్తులో కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.

Back to Top