సుప్రీం కోర్టులో వైవీ సుబ్బారెడ్డి ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం

చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌పై దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని పిల్‌

తాడేప‌ల్లి:  వైయస్ఆర్‌సీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్‌–పిల్‌) దాఖలు చేశారు. టీటీటీ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి వాడారంటూ, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ, సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని పిల్‌ వేసిన వైవీ సుబ్బారెడ్డి 

పిల్‌లో వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించిన అంశాలు:
– తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలయ పవిత్రత, ప్రాశస్త్యం కూడా ఎంతో ప్రసిద్ధం.
– శ్రీవారి ఆలయంపై హిందువులకు ఎంతో సెంటిమెంట్‌. స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు.
– స్వామి వారి ప్రసాదాలు.. లడ్డూను భక్తులు అతి పవిత్రంగా భావిస్తారు. 

– అలాంటి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు ఆరోపించారు.
– ఇది హిందువుల మనోభావాలు, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది.
– కాబట్టి ఈ అంశంలో వాస్తవాలు ఏమిటి? అన్నవి తెలియాలి. నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.
– అందుకే గౌరవ సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని దీనిపై విచారణకు నియమించాలి. ఆయనకు సహకరించేందుకు ఫుడ్‌ టెక్నాలజీ నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.

– తిరుమలలోని శ్రీవారి ఆలయంలోనే ఉండే ప్రసాదాల తయారీ కేంద్రం ‘పోటు’ లో రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తారు. 
– శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడు తప్పనిసరిగా స్వామి వారి ప్రసాదం తీసుకుంటారు.
– అలాంటి అతి పవిత్రమైనటు వంటి టీటీడీ లడ్డూపై సీఎం చంద్రబాబు ఈనెల 18న విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. 
– గత ప్రభుత్వ హయాంలో.. అంటే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో తయారు చేసిన లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని ఆరోపించారు.

– కాగా, అంతకు ముందు.. అంటే జూలై 23న మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, లడ్డూల తయారీ కోసం ఆలయానికి సరఫరా చేసిన నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిపినట్లు పరీక్షలో తేలిందని చెప్పారు.
– సరిగ్గా రెండు నెలల తర్వాత, ఈ విషయాన్ని విజయవాడలో ఒక సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు, టీటీడీలో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించడం ఆశ్చర్యం కలిగించింది.
– నిజానికి తిరుమలలో ప్రసాదాల తయారీలో వినియోగించే ప్రతి సరుకు నాణ్యత పరీక్షకు ఎప్పటి నుంచో ఒక నిర్దిష్ట ప్రామాణిక విధానం (ఎస్‌ఓపీ–స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) ఉంది.
– ప్రసాదం తయారీ కోసం తిరుమలకు వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసి నాణ్యతను పరీక్షిస్తారు. అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయితేనే, ఆ ట్యాంకర్‌ను లోపలికి అనుమతిస్తారు. ఆ నెయ్యిని ప్రసాదం తయారీకి వినియోగిస్తారు.
– అలాగే సరుకులు, నెయ్యి సేకరణ కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియకు కూడా ఎస్‌ఓపీ ఉంది. 
– అలాంటి ఒక పకడ్బందీ వ్యవస్థ, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న టీటీడీ ఆలయం, అక్కడి ప్రసాదం తయారీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తూ, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
ఈ సందర్భంగా కొన్ని వాస్తవ అంశాలను గౌరవ న్యాయస్థానం ముందు ఉంచుతున్నాం.
– జూన్‌ 4, 2024న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైయస్ఆర్‌సీపీ ఓడిపోవడంతో, టీటీడీ బోర్డు కూడా రదై్దపోయింది.
– జూన్‌ 21న, మీడియాతో మాట్లాడిన టీటీడీ కొత్త ఈఓ, తాను లడ్డూల శాంపిల్‌ పరీక్షించానని, ఆ లడ్డూలను మంచి నాణ్యతతో కూడిన నెయ్యితో తయారు చేస్తున్నారని వెల్లడించారు.
– టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతను పరీక్షించాలని తమకు శాంపిల్స్‌ అందినట్లు.. జూలై 9, 2024న ప్రకటించిన గుజరాత్‌లోని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌’ (ఎన్‌డీడీబీ), ‘సెంటర్‌ ఫర్‌ అనాలిసిస్‌ అండ్‌ లెర్నింగ్‌ ఇన్‌ లైవ్‌స్టాక్‌ అండ్‌ ఫుడ్‌’ (సీఎఎల్‌ఎఫ్‌).
– టీటీడీ పంపించిన నెయ్యి శాంపిల్స్‌పై జూలై 17, 2024న తమ నివేదికను పంపించిన ఎన్‌డీడీబీ సీఎఎల్‌ఎఫ్‌.
– ఆ రిపోర్ట్‌పై జూలై 23, 2024న మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ. ఆ నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్‌ ఫ్యాట్‌ ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడి.
– రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18, 2024న విజయవాడలో పార్టీ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూల తయారీలో, జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు.
– కాగా, సెప్టెంబరు 21, 2024న మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, కల్తీ చేసినట్లు ఆరోపణలు వచ్చిన నెయ్యిని అస్సలు వాడలేదని, నాణ్యత లేదని తేలిన నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని వెల్లడి.
– వీటన్నింటి నేపథ్యంలో వాస్తవాలు ఏమిటన్నవి అందరికీ తెలియాల్సి ఉందని, అందువల్ల తమ అభ్యర్థన మన్నించి, రిటైర్డ్‌ న్యాయమూర్తిని విచారణ కోసం నియమించాలి.
– అలాగే, ఫుడ్‌ టెక్నాలజీ నిపుణులతో కూడిన కమిటీ కూడా ఏర్పాటు చేయమని అర్థిస్తున్నాం.

Back to Top