లడ్డూ ప్రచారం వెనుక పెద్ద కుట్ర!  

 

కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష ప్రచారం తగదు. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారికి శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా వాటిని తయారు చేస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి ప్రత్యేకమైన దిట్టం ఉంది. దాని ప్రకారమే ప్రసాదాలు తయారు అవుతాయి. వీటిలో ఎవరి జోక్యం ఉండదు. అయినా కూటమి ప్రభుత్వం ఇలాంటి ప్రచారం ఎందుకు తెర మీదకు వచ్చింది?. 10 అంశాలను పరిశీలిస్తే.. 

👉 నెయ్యి క్వాలిటీ బాగా లేదు అని  టీటీడీ ల్యాబ్‌లో  టెస్ట్ చేసి నెయ్యి ట్యాంకర్‌ని బాబు హయాంలో  14  సార్లు తిరస్కరిస్తే.. జగన్ పాలనలో 18  సార్లు తిరస్కరించారు

అంటే కరెక్ట్ గానే పరీక్షలు చేసి  కల్తీ నెయ్యిని నివారించినట్టే కదా!

👉 పక్కనే మద్రాస్ లో ల్యాబ్  ఉండగా.. దూరాన ఉన్న గుజరాత్ ల్యాబ్‌కు ఎందుకు పంపారు ?

👉 2015 సెప్టెంబర్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటక  నందిని  మిల్క్ వాళ్ళు  నెయ్యి కేజీకి రూ. 326 కోట్ చేస్తే .. మహారాష్ట్ర కు చెందిన గోవింద్ మిల్క్ వాళ్ళు  నెయ్యి రూ. 276  కోట్   చేసారని వాళ్లకు  కాంట్రాక్టు ఇచ్చారు. 

మరి జగన్ కూడా  తక్కువ కోట్ చేసినవాళ్లకు  నెయ్యి కాంట్రాక్టు ఇస్తే తప్పేంటి?

👉 బాబు జూన్ 12 న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 14 న టీటీడీ EO గా శ్యామల రావు ను నియమించారు.

ఐదు మంది  నెయ్యి సప్లై చేస్తుంటే .. అందులో ఒక సప్లయర్ (ఏఆర్‌ డైరీ ఫుడ్స్‌ సంస్థ). పంపిన 4  నెయ్యి  టాంకర్ లు సరిగ్గా లేవు అని ఏఆర్‌ డైరీ ఫుడ్స్‌ సంస్థ "మొదటి సారి " పంపిన  నెయ్యి ట్యాంక్ లను (జులై 12 న ) టెస్ట్ చేసి  వెనక్కి పంపాము అని TTD EO శ్యామల రావు చెప్పారు. మరి కల్తీ ఎక్కడ జరిగింది లడ్డులో ?

👉 లడ్డూలో కల్తీపై నిపుణులేమన్నారంటే..

కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్‌, హైడ్రోజనేటెడ్‌ కూరగాయల కొవ్వు కలుపు­తారు. అంతేగానీ జంతువుల కొవ్వును కలప­రు. ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే.. వ్య­యం పెరుగుతుంది. వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరు.  
:::నేహా దీపక్‌ షా, ఆహార శాస్త్రవేత్త

జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో  తయారు చేసే లడ్డూలుగానీ ఇతర ఆహార పదార్థాల నుంచిగానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. 
:::రుచి శ్రీవాస్తవ, ఆహార పరిశోధకురాలు

👉 జూలై 23న  ల్యాబ్ నివేదిక వస్తే దాచి పెట్టి 100  రోజుల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందని (సూపర్ సిక్స్ లేకపోవడం, వరద వైఫల్యం , స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ  ..మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ..)  దాన్నించి డైవర్ట్ చేయడానికి  ఇప్పుడు బయటపెట్టి హిందూవుల మనో భావాలూ అంటూ రెచ్చకొడుతున్నాడు  బాబు

👉 ఎవరు నిజమైన భక్తులు?

పాదయాత్రకు ముందు  శ్రీవారిని ద‌ర్శించుకున్నారు జగన్. పాద‌యాత్ర ముగిశాక జ‌గ‌న్‌ కాలిన‌డ‌క‌న‌ వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. జ‌గ‌న్ మంచి భ‌క్తుడ‌ని, తిరుమ‌ల‌లో వేకువ‌జామునే 2.30కి లేచి  నిష్ట‌ప్ర‌తిష్ట‌ల‌తో పూజ‌లు చేశాడ‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కితాబిచ్చారు.జగన్ తన నివాసంలోనే గోశాలను ఏర్పాటు చేసారు. జగన్ దంపతులిద్దరూ  గోమాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.

.. చంద్ర‌బాబు హ‌యాంలో నారా లోకేశ్ కోసం క‌న‌క‌దుర్గ‌మ్మ‌, శ్రీశైలంలో క్షుద్ర పూజ‌లు చేయించారు. టీటీడీ నిధుల‌ను చంద్ర‌బాబు త‌న పార్టీ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల‌కు కేటాయించి దుర్వినియోగం చేశారు. తిరుపతిలో  వేయి కాళ్ళ మండపం కూల్చారు.  విజ‌య‌వాడ‌లో కృష్ణా పుష్క‌రాల పేరుతో 40 గుడులు కూల్చారు. కానీ జ‌గ‌న్ సీఎం అయ్యాక 7 గుడులను పున‌ర్ నిర్మించారు.

టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ప‌ర‌మ భక్తుడు. 45  సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆయ‌న ఇంట్లో గోశాల ఉంది. నిత్యం గో పూజ చేయందే ఇంట్లో నుంచి అడుగు బ‌య‌ట పెట్ట‌రు.

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి (2004-09) సీఎంగా ఉన్న‌ప్పుడు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ (SVBC) ప్రారంభించారు.

👉 లడ్డూ వివాదం వెనక హెరిటేజ్ కు లాభలు తేవాలనే కుట్ర ఉందేమో అని  తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే అనుమానం

👉 లడ్డు  వివాదం లో నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి వైస్ జగన్ లేఖ.. 

సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జి తో బాబు ఆరోపనలపై విచారణ చేయించాలి. లడ్డు ఆరోపణలపై ప్రధాని కూడా స్పందించాలి 
:::టీటీడీ మాజీ చైర్మన్ భూమన

తిరుపతి లడ్డుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై గురించి విచారణ  జరపాలని హై కోర్ట్ లో YV సుబ్బారెడ్డి పిటీషన్

👉 ఏపీలో  85 శాతానికి పైగా హిందువులు ఉన్నారు. మరి హిందువుల మనో  భావాలూ దెబ్బతినే విధంగా బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా  చేస్తారా ?. కాబట్టి లడ్డు వివాదం వెనుక కుట్ర ఉంది అని తేలిపోలా?. 

Back to Top