ఆర్ట్ ఆఫ్ కరప్షన్ గా సోమిరెడ్డి ఖ్యాతి 

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

సోమిరెడ్డి అండ్ సన్ లిక్కర్ మాఫియాతో సర్వేపల్లి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.

లిక్కర్ మాఫియాగా మారి, సోమిరెడ్డి కోట్లు కొల్లగొడుతున్నాడు 

దొంగలు రాత్రులు కన్నాలు వేస్తే, సోమిరెడ్డి సర్వేపల్లిలో పట్టపగలే కన్నాలు వేస్తున్నాడు 

సోమిరెడ్డి దెబ్బతో లిక్కర్ వ్యాపారస్తులు బెంబేలెత్తి హడలిపోతున్నారు 

నెల్లూరు జిల్లా:  ఆర్ట్ ఆఫ్ కరప్షన్ గా టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఖ్యాతి గ‌డించార‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. సోమిరెడ్డి అండ్ సన్ లిక్కర్ మాఫియాతో సర్వేపల్లి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నార‌ని చెప్పారు. సర్వేపల్లి లిక్కర్ మాఫియా పై  మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. 

కాకాణి ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..

  • సోమిరెడ్డి "ఆర్ట్ ఆఫ్ కరప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్" గా తయారయ్యాడు.
  • సోమిరెడ్డి లిక్కర్ వ్యాపారానికి సంబంధించి షరతులతో కూడిన అనేక వసూళ్ల విధానాన్ని ప్రవేశపెట్టాడు.
  • సోమిరెడ్డి ప్రకటించిన రేట్లు మాకు గిట్టుబాటు కావు మహాప్రభో! అంటూ, మద్యం వ్యాపారులు చేతులెత్తేశారు.
  • సోమిరెడ్డి కొడుకు గత్యంతరం లేక సోమిరెడ్డి ప్రకటించిన రేట్లపై "రివర్స్ టెండరింగ్" విధానాన్ని ప్రవేశపెట్టాడు.
  • సోమిరెడ్డి ఒక్కొక్క షాపుకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే, సోమిరెడ్డి కొడుకు రాజ గోపాల్ రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా కాస్త తగ్గించి, ఒక్కొక్క షాపుకు 5 లక్షల రూపాయల ధర నిర్ణయించాడు.
  • సర్వేపల్లిలో రివర్స్ టెండరింగ్ పూర్తయినట్లు సోమిరెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన తర్వాతనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం దుకాణాలకు లైసెన్స్ లు మంజూరు చేసింది.
  • సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక నాయకులకు కొంత నగదు సర్దుబాటు చేయాలని, ఒక్కొక్క షాపు నుండి 5 లక్షల రూపాయల చొప్పున 28 షాపుల నుండి 1 కోటి 40 లక్షల రూపాయలు వసూలు చేసిన సోమిరెడ్డి అండ్ సన్ ఒక్క నాయకుడికైనా, ఒక్క రూపాయి ఇచ్చారా!
  • సర్వేపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలకు వాటా ఇవ్వాలంటూ, ప్రతి షాపులో 30శాతం వాటా తీసుకొని తమ గల్లా పెట్టెలో వేసుకోవడం తప్ప, ఒక్క కార్యకర్తకైనా, ఒక శాతం వాటా ఇచ్చారా!
  • సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలలో 300 బెల్ట్ షాపులు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ, ఒక్కో బెల్టు షాపు నుండి నెలకు 15వేల రూపాయల చొప్పున 45 లక్షల రూపాయలు ప్రతినెలా తన కార్యాలయ నిర్వహణ ఖర్చుల కోసం సోమిరెడ్డి వసూళ్లకు స్కెచ్ వేసిన మాట వాస్తవం కాదా!
  • సోమిరెడ్డి అండ్ సన్ సర్వేపల్లిలో 28 మద్యం షాపులకు అనుబంధంగా ఒక్కొక్క కూల్ డ్రింక్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ, ఒక్కో కూల్ డ్రింక్ షాపు నుండి నెలకు 30వేల రూపాయలు చొప్పున సోమిరెడ్డి 8 లక్షల 40 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించిన మాట వాస్తవం కాదా!
  • సోమిరెడ్డి అండ్ సన్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించడంతో శాసనసభ్యునిగా గెలిచి, నాయకులు, కార్యకర్తల పేరిట వసూళ్లకు పాల్పడుతూ, నాయకులను, కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహవేశాలతో ఊగిపోతున్న తెలుగు తమ్ముళ్లు.
  • సోమిరెడ్డి లాంటి వాడు తప్ప, ఈ దేశంలో, ఏ పార్టీలో, నాయకులు, కార్యకర్తల పేరు చెప్పి దోచుకునే వారు ఇంకొక్కరు ఉండరు.
  • సోమిరెడ్డి అన్ని షరతులతో పాటు, ఎవరైనా సోమిరెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే, సర్వేపల్లి మద్యం షాపుల యజమానులు అందరూ ఒక్కటై, కౌంటర్ ఇవ్వాలని షరతులు విధించిన మాట వాస్తవం కాదా!
  • సోమిరెడ్డికి ధైర్యముంటే, సర్వేపల్లి లిక్కర్ మాఫియాలో తన పాత్ర లేకపోతే చంద్రబాబు దగ్గరకు వెళ్లి అధికారుల మీద వేయిస్తున్నట్లుగా, సిఐడి ద్వారా గానీ, విజిలెన్స్ ద్వారా గానీ, ఏసీబీ ద్వారా గానీ తనపై తాను విచారణ కోరగలడా!
  • సర్వేపల్లి లో సోమిరెడ్డి అవినీతికి నేను అడ్డుపడడంతో, దొంగ తిండి తినే కుక్క ముందు కంచం లాగేస్తే, ఎలా అరుస్తుందో అలా సోమిరెడ్డి అరవడం తప్ప, ఒరిగేది ఏమి ఉండదు.
  • ఆర్ట్ ఆఫ్ కరప్షన్ - సోమిరెడ్డి మొరిగితే, భయపడే పిరికి వాళ్లం కాదు.
  • సోమిరెడ్డి దౌర్జన్యాలను తట్టుకోలేక ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులే నాకు ఫిర్యాదు చేస్తున్న, ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు.
  • సర్వేపల్లిలోని వ్యాపారులు ఎవరైనా చాటుమాటున కాకుండా, ధైర్యంగా సోమిరెడ్డి అవినీతి, అరాచకాలపై గళం విప్పితే, అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నా..
  • సోమిరెడ్డి అండ్ సన్ విచ్చలవిడిగా పాల్పడుతున్న అవినీతిని, అక్రమ సంపాదనను ఎండగడుతూ, ఎప్పటికప్పుడు సర్వేపల్లి ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడానికి నా ప్రయత్నాలు కొనసాగుతాయి.
  • సోమిరెడ్డి లాంటి అవినీతిపరుడు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు.
  • సోమిరెడ్డి అండ్ సన్ లకు మద్యంపై వచ్చే ఆదాయం తప్ప, సర్వేపల్లి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు ముఖ్యం కాదని పలువురి స్థానిక నేతల అభిప్రాయం.
Back to Top