విజయవాడ: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వ తప్పిదమే కారణమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలుగా గుర్తించారు. 25 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వెల్లంపల్లి స్పందించారు. వెలంపల్లి శ్రీనివాస్ ఏమన్నారంటే.. ముక్కోటి ఏకాదశి ముందుగా అందరికీ తెలిసి వచ్చే కార్యక్రమం: అప్పటికప్పుడు వచ్చే కార్యక్రమం కాదు: లక్షలమంది వస్తారని తెలుసు : అయినా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారు: ప్రభుత్వం పూర్తిగా విఫలమై పోయింది: బాధ్యులమీద చర్యలు తీసుకోవాలి: తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ ఛైర్మన్ మార్చాడు: భక్తులను పక్కకు వదిలేసి వీఐపీల సేవలో ఛైర్మన్ తరిస్తున్నారు: టీటీడీ ఈవోకూ అక్కడి కార్యక్రమాలమీద అవగాహన లేదు: వీళ్లంతా రాజకీయ అజెండాలో భాగంగానే తిరుమలకు వచ్చారు తప్ప, భక్తులకు సేవ చేయాలని కాదు : కనీస సౌకర్యలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం: తొక్కిసలాటలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే : నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు కనీసం ముక్కోటి ఏకాదశి సందర్భాన కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు: ముఖ్యమంత్రిగారు పబ్లిసిటీ స్టంట్లు ఆపి, భక్తులకు మంచి సౌకర్యాలు అందిచడంపై దృష్టిపెట్టాలి: మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నా: గాయపడ్డ వారు కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను: దేవాదాయ శాఖ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.