తాడేపల్లి: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మరణించడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఎవరు నైతిక బాధ్యత వహిస్తారని, సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్లలో ఎవరు రాజీనామా చేస్తారని విరూపాక్షి ప్రశ్నించారు. మృతుల వైయస్ఆర్సీపీ తరఫున సంతాపం తెలుపుతూ ప్రభుత్వ తీరును తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఎండగట్టారు. టీటీడీ చైర్మన్‌కు మీడియా, రాజకీయ పిచ్చి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఎంతో భక్తిశ్రద్దలతో ఉండాల్సిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి మీడియా పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందని, అలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్‌గా చంద్రబాబు కూర్చోబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, కూటమి ప్రభుత్వంలో పూర్తిగా టీటీడీని రాజకీయ వేదికగా మార్చారని ధ్వజమెత్తారు. పవిత్రమైన తిరుపతిలో ఇంత అపవిత్రం జరిగింది, గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏ రోజూ ఏ తప్పు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మరణాలపై సమాధానం చెప్పాలి తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు వహిస్తారా లేక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లేక, టీటీడీ ఛైర్మన్ వహిస్తారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటుంటారు, మరి ఇప్పుడు ఏమయ్యారు, పూర్తిగా పరిపాలనా వైఫల్యం వల్లే ఈ తప్పిదం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌పై పెట్టిన శ్రద్ద ప్రజల సమస్యలపై పెట్టలేదని ఫైర్ అయ్యారు. తిరుపతిలో జరిగిన మరణాలపై వెంటనే ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని విరూపాక్షి డిమాండ్ చేశారు. ఇది పాలనా వైఫల్యం కాదా? చంద్రబాబు తన పరిపాలనలో నన్ను మించిన వారు లేరంటారు, తొక్కిసలాట ఘన మీ పాలనా వైఫల్యం కాదా అని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్‌కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల ఇద్దరు యువకులు అన్యాయంగా బలయ్యారు, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాక్షాత్తూ దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చిన రోజే తిరుపతిలో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. హిందూ ధర్మం అన్న వారంతా ఏమయ్యారు, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు.