రామోజీ వ‌ద్ద కాల్వ శ్రీ‌నివాస్ బ్రోక‌ర్ ప‌నిచేశాడు

ప్ర‌భుత్వ విప్ కాపు రామ‌చంద్రారెడ్డి ఫైర్‌

అనంతపురం: టీడీపీ హ‌యాంలో రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయిన ఓ దద్దమ్మ  కాల్వ శ్రీనివాస్‌ అని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయ‌దుర్గంలో నాలుగున్న‌రేళ్ల వైయ‌స్‌ఆర్ సీపీ పాల‌న‌లో తాను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతాన‌ని, సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్‌ అబద్ధాలు చెబుతున్నాడ‌ని మండిప‌డ్డారు. టీడీపీ పాలనలో కాల్వ శ్రీ‌నివాస్‌ వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడ‌ని.. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్‌ బ్రోకర్‌ పని చేశాడంటూ దుయ్యబట్టారు. సీఎం వైయ‌స్ జగన్‌ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశాన‌ని, 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించానని, 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని కాపు రామచంద్రారెడ్డి వివ‌రించారు. 

Back to Top