ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై కొన‌సాగుతున్న వేధింపులు

పీటీ వారెంట్‌పై కురుపాం తరలింపు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్‌ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడం లేదు. ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై ప్ర‌భుత్వ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు ఆగ‌డం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ ను పిటి వారెంట్ పై కురుపాం తరలించారు.  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కుటుంబ స‌భ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్‌ నిమిత్తం జైళ్లకు తరలించారు. 
 

Back to Top