ప్రజల భద్రతను పక్కన పెట్టారు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ: ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు

 ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..
‘రాష్ట్రంలో పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీ పోలీసులు తమ  వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారు. 680 మంది వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు అందించారు. 147 కేసులు నమోదు చేసి, 49 మందిని  అరెస్టు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారు’ అని విజ‌య‌సాయిరెడ్డి పోస్టు చేశారు. 

Back to Top