అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఏరకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలూ ఆయన చలించిపోతారు. జనాల కోసం ఎంతదూరమైన వెళ్తారు. ఆ క్రమంలో.. ఎవరెన్ని రకాలుగా నిందించినా, ట్రోల్ చేసినా ఆయన అడుగులు ఆగిపోవు. ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైయస్ జగన్ అభిమతం. సహాయం అందించే విషయంలోనూ ఆయనది అదే ధోరణి. సీఎంగా ఉన్న టైంలో వైయస్ జగన్ ఎలాంటి కార్యక్రమానికి వెళ్లినా.. కచ్చితంగా ఎంతో కొంత మందికి సాయం అందేది. అలాగే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీలైనంత తొందరగా సాయం అందేది!. అయితే ఇప్పుడు సీఎంగా లేకున్నా కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బహుశా ఈ గుణమే.. జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకునేలా చేస్తోందేమో!. జగన్ ఊరకనే జననేత అయిపోలేదు. ఇప్పటికీ ఫలానా చోటుకి.. ఆయన వస్తున్నారంటేనే జనం తండోపతండాలుగా వస్తారు. బడి ఈడు పిల్లల నుంచి పండు ముసలి అవ్వల దాకా.. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే వైయస్ జగన్‌ను దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. షేక్‌హ్యాండ్ ఇవ్వాలని.. ఆయనతో ఓ ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక అంతే ఒద్దికగా స్వీకరిస్తుంటారాయన. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే!. ఎవరైనా తనను కలవడంలో ఇబ్బంది పడడం ఆయన కంటపడితే.. దగ్గరికి పిలిపించుకుంటారు. లేదంటే స్వయంగా ఆయనే వాళ్ల దగ్గరకు వెళ్తారు. అదంతా ‘తరలించిన అభిమానం’ అని కొందరు తీసిపారేయొచ్చేమో!. కానీ, ‘తరలివచ్చిన అభిమానం’ అని నిరూపించిన సందర్భాలు కోకోల్లలు ఉన్నాయి కదా!. పైగా మీరంతా ‘నా వాళ్లు’ అని అన్నివర్గాలను ఉద్దేశించి ఆయన అంటుంటారు కదా!. పోనీ అలా చెప్పే లీడర్లు దేశంలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కనిపించరు మరి. జగన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను గమనిస్తే.. ఎలాంటి మాస్ లీడర్ ఇంతకాలం దానిని నిలబెట్టుకునేవారు కాదేమో!. తమ బాగోగుల కోసం జగన్ అంతలా ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అంతులేని అభిమానం. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన జనం మధ్య ఉండే మనిషే. ఇది బలమైన ముద్ర. ఎవరెన్ని రకాలుగా అనుకున్నా సరే ఇది అంగీకరించాల్సిన విషయం. #HBDYSJagan జగన్ అంటే.. జనానికి ఎందుకంత ఎమోషన్? జనం ఇబ్బందుల్లో ఉంటే.. వాళ్ల దగ్గరికి వెళ్లాలి. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకోవాలి. తమ బాధ్యతగా ప్రభుత్వాల్ని నిలదీయాలి. అవసరమైతే ‘నేనున్నాను..’ అంటూ బాధితుల్ని ఓదార్చాలి. అంతేగానీ తాను వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయని తప్పించుకునేవాడు అసలు నాయకుడేనా?. అధికారంతో ఆయనకు సంబంధం లేదు. అది ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా నటించడం ఆయనకు చేత కాదు. గత ఐదేళ్లు. పేదల ముఖాల్లో సంతోషం అనే వెలుగులు పూయించేందుకు ప్రతీ క్షణం పాటుపడ్డారు. సంక్షేమంతో అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. సమస్య ఎక్కడున్నా సత్వర పరిష్కారం కోసమే ఆయన తాపత్రయం కనిపిస్తుంది. అందుకేనేమో.. జగనన్న ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటుంది. పండు ముసలి నుంచి ఊహతెలిసిన పిల్లాడి దాకా.. ఆయన ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఆయన్ని దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. తమ ఫోన్లలో క్లిక్‌మనిపించాలని ఆరాటపడుతుంటారు. ఆ అభిమానాన్ని అంతే ఒద్దికగా ఆయన స్వీకరిస్తుంటారు. ఓల్డ్ ఆర్‌ఆర్ పేట వరద బాధితుల్ని కలవడానికి వెళ్లినప్పుడు తనను చూసి భావోద్వేగానికి గురైన ఓ చిన్నారి కన్నీళ్లను తుడుస్తూ కనిపించారాయన. రాజకీయాల్లో అవసరాలకు తగట్లు మసులు కోవడం జగన్ స్టైల్ కానే కాదు. జనాలకు దూరంగా ఉండడం.. ఫొటోలకు ఫోజులిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నామని బిల్డప్‌లు ఇవ్వడం.. ఆయన చేయరు. కులాల ప్రస్తావన తెచ్చి మరీ జనాలను కించపరిచేలా ఆయన ఏనాడూ మాట్లాడరు. ఎప్పటికీ ఆయన జనం మనిషి.. పేదల పక్షపాతి. అందుకే.. ఆయన వస్తున్నారంటేనే జనం ఆటోమేటిక్‌గా తరలివస్తారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. తమ బాగుకోసం అంతలా ఆయన ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అభిమానం. అందుకే ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేని ఆయన కూడా వాళ్లను దగ్గరకు తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. రాజన్న బిడ్డగా.. అంతకు మించి జనం మెచ్చిన జననేతగా జగన్‌కంటూ ఓ గుర్తింపు ఉంది. ఇది ఎవరైనా అంగీకరించాల్సిన విషయం. ఇట్లు.. ఓ జగన్ అభిమాని