ఘ‌నంగా వైయ‌స్ జ‌గ‌న్ ముంద‌స్తు జ‌న్మ‌దిన వేడుక‌లు

ప్ర‌కాశం జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన ముంద‌స్తు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ నెల 21న వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు కాగా, ఒక రోజు ముందుగానే ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వ‌ర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లు నిర్వ‌హించారు.  మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో కేట్ కట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సౌజన్యంతో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే విదేశాల్లో కూడా ముంద‌స్తు జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

Back to Top