కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ సేవా కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

చిత్తూరు:  రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ నిరంకుశ పాల‌న కొన‌సాగిస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నెల 21న‌ మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా సేవా కార్య‌క్ర‌మాల‌కు పార్టీ పిలుపునిచ్చింది. అయితే కుప్పంలో మాత్రం వైయ‌స్ఆర్‌సీపీ సేవా కార్య‌క్ర‌మాల‌కు పోలీసు అధికారులు అనుమ‌తి నిరాక‌రించారు. ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అనుమ‌తి నిరాక‌రించారు. పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top