రాష్ట్రంలో నియంత పాలన 

ఎమర్జెన్సీ సమయంలోనూ ఇలాంటి పాలన జరగలేదు

ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా చంద్రబాబు విధానాలు

మాజీ చీఫ్‌ విప్, వైయస్‌ఆర్ సీపీ నేత గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం

అధికార దుర్వినియోగంతో తనపై ఉన్న అవినీతి కేసులను నీరు గారుస్తున్న చంద్రబాబు

తాను నిర్థోషినంటూ ఏకంగా తీర్పులు ఇచ్చుకుంటున్న చంద్రబాబు

న్యాయ వ్యవస్థను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

చంద్రబాబు అవినీతి కేసులను విచారించే న్యాయమూర్తులపై నిఘా పెడతారా?

ఐపీఎస్‌ అధికారులను సస్సెండ్‌ చేయడం అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదా?

కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారుస

చట్ట విరుద్దంగా పోలీసులు సోషల్‌ మీడియా యాక్టివీస్ట్‌ లపై వేధింపులకు పాల్పడుతున్నారు

ఆగ్రహం వ్యక్తం చేసిన గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపైనా అబద్దాలు ప్రచారం చేశారు

2014–19 చంద్రబాబు హయాంలో మొత్తం అప్పులు రూ.3.15 లక్షల కోట్లు

2019–24 జగన్‌ గారి హాయంలో మొత్తం అప్పులు రూ. 6.46 లక్షల కోట్లు

అయితే రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశామంటూ విష ప్రచారం చేశారు. 

అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ జగన్‌ గారి హయాంలో పాలన

నిర్మాణ రంగంలో చంద్రబాబు హయాంలో ప్రగతి 1.42 శాతం

వైయస్‌ జగన్‌ గారి హయాంలో ప్రగతి 2.86 శాతం

చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం రూ.1.42 లక్షలు

వైయస్‌ జగన్‌ గారి హయాంలో తలసరి ఆదాయం రూ.2.30 లక్షలకు పెరిగింది

వెల్లడించిన గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

వైయస్‌ఆర్ సీపీ పాలనలోనే గణనీయమైన ప్రగతి

నిర్దారించిన కేంద్ర మినిస్ట్రీ ఆఫ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ ఇంప్లిమెంటేషన్‌ 

వైయ‌స్ జగన్‌ గారి హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ 13 లక్షల కోట్లకు చేరింది

మౌలిక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించినట్లు గణాంకాలు

పోలవరంపై చంద్రబాబు అసత్యాలు

చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది

చంద్రబాబు చెప్పే అబద్దాలపై చర్చకు సిద్దం

ప్రెస్‌మీట్‌లో గడికోట శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంతపాలనను సాగిస్తోందని మాజీ చీఫ్‌ విప్, వైయస్‌ఆర్ సీపీ సీనియర్‌ నాయకుడు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1977 నాటి ఎమర్జెన్సీ కాలం కంటే దారుణంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఏ నియంతా వ్యవహరించని విధంగా ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి, అరాచక పాలనకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు నియంతృత్వ ధోరణి:
    ముఖ్యమంత్రి చంద్రబాబు తన గత పాలనలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు. స్కిల్‌ డెవలప్‌ మెంట్, ఫైబర్‌ నెట్, రాజధానిలో అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌ మెంట్‌ కుంభకోణాల్లో చంద్రబాబుపై ఎపిసిఐడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు సీఎంగా అధికారాన్ని చేపట్టగానే ఆ కేసులను నీరుగారుస్తున్నారు. తనకు తానే క్లీన్‌చీట్‌ ఇచ్చకుంటూ, ఈ కేసుల్లో తాను నిర్ధోషినంటూ తీర్పులు సైతం చంద్రబాబు రాసుకుంటున్నాడు. ఇంత నియంతత్వ దోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 

యథేచ్ఛగా అధికార దుర్వినియోగం:
    ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న చంద్రబాబుకు చివరికి న్యాయ వ్యవస్థపైన కూడా గౌరవం లేదు. ఏకంగా న్యాయవ్యవస్థకు చెందిన జడ్జ్‌ లపై నిఘా పెట్టి, వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామిక విలువలు లేకుండా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌ ఆఫీసర్లను సస్పెండ్‌ చేసిన విధానం, మిగిలిన అధికారులను భయపెట్టేలా వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే, గతంలో ఏనాడు ఇటువంటివి ప్రజలు చూసి ఉండరు. ఏ నియంతృత్వ, రాజరిక పాలనలోనూ ఇలాంటివి జరగలేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కొందరు యువత సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే వారిపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు ఏకంగా చట్టాలకు విరుద్దంగా సివిల్‌ డ్రస్‌ ల్లో, నంబర్‌ ప్లేట్‌ లు లేని వాహనాల్లో, ముసుగులు కప్పి మరీ ప్రశ్నించే వారిని నిర్భందంలోకి తీసుకుంటున్నారు. అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్నాడు. ప్రపంచంలోని పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలకు నిజాలు తెలియకూడదని, తాము చెప్పేవే వాస్తవాలు అని నమ్మాలి అనే విధానంలో కూటమి పాలన సాగుతోంది. ప్రతిపక్షంగా మేం ఎత్తి చూసిన వాటిపై ఏదైనా తప్పు అనిపిస్తే చర్చకు పిలవండి, మా పశ్నలకు సమాధానం చెప్పాలే కానీ మాపైనే ఎదురుదాడి చేస్తామనే విధానం మంచిది కాదు. 

అప్పులపై ప్రతిసారీ చంద్రబాబు అబద్దాలు:
    ఎన్నికల సమయానికి రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశామంటూ వైయస్‌ఆర్‌ సిపి ప్రభుత్వంపై బురదచల్లారు. కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల వరకు బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. నవంబర్‌ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ డాక్యుమెంట్‌ ల్లోనే వైయస్‌ఆర్‌ సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి చేసిన అప్పులు రూ.4.91 లక్షల కోట్లు అని చెప్పారు. రాష్ట్ర విభజన నాటికి అప్పులు రూ. 1.18 లక్షల కోట్లు ఉంటే, 2014–19 టిడిపి హయాంలో అవి రూ. 2.60 లక్షల కోట్లుకు చేరాయి. ప్రభుత్వ  గ్రాంట్లు, కంటిన్యుటీ లయబిలిటీ, ప్రభుత్వ గ్యారెంటీ డెబిట్‌లు అన్నీ తీసుకుంటే టిడిపి ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్న మొత్తం అప్పులు రూ.3.15 లక్షల కోట్లు. అదే వైయస్‌ఆర్‌ సిపి ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఈ అన్ని అంశాలు కలుపుకుంటే ఉన్న అప్పుల మొత్తం రూ.6.46 లక్షల కోట్లు. కానీ గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈ అప్పుల లెక్కలను రెట్టింపు చేసి, రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ వైయస్‌ఆర్‌ సిపి పై విషపు ప్రచారం చేశారు. అయిదేళ్ళ సగటు అప్పుల శాతంను చూస్తే 2014–19 చంద్రబాబు హయాంలో 22.63 శాతం ఉంటే, 2019–24 వైయ‌స్ జగన్‌ గారి హయాంలో అప్పుల శాతం 13.57 శాతం ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం పదేపదే వైయస్‌ఆర్‌ సిపి హయాంలో విధ్వంసకర పాలన సాగిందంటూ పచ్చి అబద్దాలను వల్లేవేస్తున్నారు. జగన్‌ గారి హయాంలో అభివద్ధి, సంక్షేమంను రెండు కళ్ళలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. 

వైయ‌స్ జగన్‌ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది:
    అభివృద్ధి రేటు, రాష్ట్ర తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా వైయ‌స్ జగన్‌ గారి హయాంలో  గణనీయంగా పెరిగాయి. వ్యవసాయం, నిర్మాణరంగం, ఉత్పత్తిరంగాల్లో మంచి ప్రగతి వైయస్‌ఆర్‌ సిపి ప్రభుత్వంలో జరిగిందని ఏకంగా కేంద్రప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ ఇంప్లిమెంటేషన్‌ విభాగం వెలువరించిన నివేదికల్లో చాలా స్పష్టంగా చెప్పింది. గత అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో నిర్మాణరంగంలో ప్రగతి 2.86 శాతం అయితే అదే వైయ‌స్ జగన్‌ గారి హయాంలో 4.07 శాతానికి పెరిగింది. అలాగే చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం రూ. 1.42 లక్షలు ఉంటే, వైయ‌స్ జగన్‌ గారి హయాంలో అది రూ.2.30 లక్షలకు పెరిగింది. చంద్రబాబు హయాంలో పరిశ్రమల రంగంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, జగన్‌ గారి హయాంలో 8వ స్థానంలో నిలబడింది. రాష్ట్రంలో మూలధన వ్యయం కూడా చంద్రబాబు అయిదేళ్ల పాలన కంటే పదిశాతం ఎక్కువగానే జగన్‌ గారి పాలనలో చేశారు.  
 
పార్లమెంట్‌ సాక్షిగా వెలువరించిన గణాంకాలపై ఏం చెబుతారు చంద్రబాబూ?:
    చంద్రబాబు పాలన కంటే వైయస్‌ జగన్‌ గారి పాలనలోనే ఈ రాష్ట్రంలో చక్కని ఫలితాలను, ప్రగతిని సాధించారని జాతీయ సంస్థలే తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి.  2018–19లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ 7.9 లక్షల కోట్లు ఉంటే వైయ‌స్ జగన్‌ గారి హయాంలో అది 13 లక్షల కోట్లకు పెరిగింది. అగ్రికల్చర్‌ రంగంలో 13 శాతం, మైనింగ్‌ రంగంలో 11 శాతం, మ్యానుఫ్యాక్చర్‌ రంగంలో 9 శాతం, ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌ రంగంలో 17.25 శాతం, నిర్మాణ రంగంలో 14 శాతం, ట్రేడ్‌ రిపేర్, హోటల్స్, రెస్టారెంట్ల రంగంలో 11 శాతం వృద్ధిని వైయస్‌ఆర్‌ సిపి ప్రభుత్వ హయాంలో సాధించడం జరిగింది.
    ఇవ్వన్నీ పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు. పార్లమెంట్‌ సాక్షిగా వెలువరించిన ఈ గణాంకాలను చూసి చంద్రబాబు ఏం చెబుతారు?  ఇంత గొప్పగా అభివృద్ధిని సాధించి, వాటిని ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయారంటూ సాధారణ ప్రజలే ఈ ప్రగతిని ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేసి, అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. 

పోలవరానికి చంద్రబాబే శాపం:
    పోలవరం ప్రాజెక్ట్‌ పైన ఇష్టారాజ్యంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం 23 అనుమతులకు గానూ 22 అనుమతులను ఆనాడే వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు తీసుకువచ్చారు. కూడి ఎడమ కాలువలను పూర్తి ఏసి, పోలవరంకు దిశాదశ కల్పించారు. జాతీయ ప్రాజెక్ట్‌ గా కేంద్రం పోలవరంను నిర్మిస్తానని ముందుకు వస్తే, తన కమీషన్ల కోసం తామే చేస్తామంటూ చంద్రబాబు పోలవరంను చేపట్టాడు. ఒక ప్లానింగ్‌ లేకుండా  భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చే గోదావరిలో ప్రవాహాన్నిమళ్లించే కాఫర్‌ డ్యాం లను నిర్మించకుండా డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేశారు. చంద్రబాబు చేసిన ఈ తప్పిదం వల్ల భారీ వరదకు డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం జరిగింది. దీనివల్ల ప్రాజెక్ట్‌ నిర్మాణం మరింత జాప్యం అవుతోంది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. వాస్తవం ఇలా ఉంటే, పోలవరం జాప్యంను వైయస్‌ జగన్‌ గారి మీదకు నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నిజాలను నిర్భయంగా మాట్లాడలేకపోతున్నారు. ఎప్పుడూ తన తప్పులను ఇతరులపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు.
    పోలవరం.. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలువునా ముంచేశాడు. రూ.50 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు రాజధాని కోసం పిలుస్తున్నాము అని చెబుతున్నాడు. అదే మా ప్రభుత్వం విశాఖలో రూ.390 కోట్లతో  వైజాగ్‌ సిటీకి ఒక అసెట్‌ గా ఉండేలా ఒక భవనం నిర్మిస్తే దానిపైన పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. రాజధాని నిర్మాణానికి వైయస్‌ఆర్‌ సిపి ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. వరద వచ్చి మునిగిపోయే ప్రాంతంలో వేల కోట్లు ఖర్చు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అనేదే మేం ప్రశ్నిస్తున్నాం.

చంద్రబాబు అబద్ధాల పరంపర:
    ఎటువంటి అబద్దమైనా సరే అవలీలగా చెప్పడం చంద్రబాబుకు అలవాటు. ఎన్నికలకు ముందు విశాఖ తీరంలో కంటైనర్లలో డ్రగ్స్‌ అని ఆరోపించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో భూములు కాజేస్తున్నారంటూ అభియోగాలు మోపారు. రూ.4 వేల కోట్లతో ప్రభుత్వ భవనాలకు రంగులు వేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా అసత్యం. ఆ ఖర్చు కేవలం రూ.100 కోట్లు మాత్రమే అని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. 30 వేల మంది మహిళలు ఉమెన్‌ ట్రాఫెకింగ్‌ అంటూ గగ్గోలు పెట్టారు. ఇది కూడా అబద్దమని తేలిపోయింది. చిరంజీవితో దండం పెట్టించుకున్నారు, హీరో మహేష్, ప్రభాస్‌ను అవమానించారని అబద్దపు ప్రచారం చేశారు. 
    రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ చంద్రబాబు పదేపదే అబద్దాలను వల్లె వేశారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ ఓ పెద్ద అబద్దం. జగన్‌గారి పైన లక్ష కోట్ల ఆదాయం అంటూ బురద చల్లారు. మద్యం ధరలు తగ్గిస్తామని, వాలంటీర్లకు పది వేల గౌరవ వేతనం ఇస్తామని, సీజ్‌ ద షిప్‌ పేరుతో పిడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా అడ్డుకుంటున్నామని, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి బోట్లను పంపించారని, పోలవరం నిర్మాణంను ఆపేశారని, ఆదానీ ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ ఇలా నోటికి వచ్చినన్ని అబద్దాలు చెప్పారు. వీటిల్లో ఒక్కటి కూడా నిరూపించ లేకపోయారు. చంద్రబాబులాగా అబద్దాలు చెప్పే అలవాటు వైయస్‌ఆర్‌ సిపికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం మాత్రమే తెలుసు. మంచి పాఠశాలలు, ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు, పోర్ట్‌లు, హార్బర్లు ఇలా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, అభివృద్ధి చేయడమే వైయస్‌ఆర్సిపికి తెలుసు. చంద్రబాబు మాపై చేస్తున్న విషప్రచారంపై నిజాలను నిగ్గు తేల్చేందుకు దమ్ముంటే చర్చలకు రావాలి.

Back to Top