జ‌న‌నేత జ‌న్మ‌దినం..జ‌గ‌మంతా సంబ‌రం

అట్ట‌హాసంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

తెలుగు రాష్ట్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల సేవా కార్య‌క్ర‌మాలు

ఇత‌ర రాష్ట్రాలు, దేశాల్లో కూడా వేడుక‌లు

అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో వైయస్.జగన్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కేక్ కట్ చేసి సందడి చేసిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు.. పెద్ద ఎత్తున రక్తదానశిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లోనూ సేవాకార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు. పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు. 

శ్రీకాకుళం జిల్లా 
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇచ్చాపురం నాలుగు మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ, మండల ఎంపీపీలు. సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

టెక్కలి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ మోహనరెడ్డిపుట్టినరోజు సందర్భంగాటెక్కలి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టెక్కలి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తల మధ్యలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 

ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆముదాలవలస పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను  వైయస్సార్ జంక్షన్ వద్ద కేక్ కట్ చేసి  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్,మున్సిపల్ నాయకులు కార్యకర్తలు నాలుగు మండల ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

పొందూరులో మాజీ సీఎం వైయస్.జగన్ పుట్టిన రోజు సందర్బంగా కాలింగ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్ణణరావు ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచక పాలనతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్ఆర్సిపి నాయకులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

టెక్కలి నియోజకవర్గంలో ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ పుట్టినరోజు సందర్భంగా టెక్కలి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి పేరాడ తిలక్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం వైస్సార్సీపీ 4మండలాల  జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేసారు. అనంతరం పేద విద్యార్థుల కి దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు. 

విజయనగరం జిల్లా.
రాజాం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విజయనగరం జిల్లా, రాజాం లోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ యలకల వాసునాయుడు తదితరులు రక్తదానం చేసి  జగనన్న పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

బొబ్బిలి నియోజకవర్గంలో  మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ  మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కార్యకర్తలు, నాయకులు సమక్షంలో కేక్ కట్ చేశారు. 

శృంగవరపుకోట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

విజయనగరం నియోజకవర్గంలో మాజీ సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా విజయనగరం పైడితల్లి ఆలయం లో విశేష పూజలు చేసిన డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, పట్ణణ పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు. అనంతరం పేదలకు రగ్గులు పంచిన కోలగట్ల శ్రావణి. 

నెల్లిమర్ల నియోజకవర్గంలో మాజీ సీఎం వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా భోగాపురం మండలం ఎ రావివలస లో ఊరంతా వేడుక నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత ఉప్పాడ శివారెడ్డి ఆధ్వర్యం లో 52 కేజీ ల కేక్ కట్ చేసి, వినోద కార్యక్రమాలు నిర్వహించి, అన్నదానం నిర్వహించారు. వైయస్.జగన్ పుట్టిన రోజున  2015 నుండి ఊరు సంబరం గా  ఆనవాయితీ నిర్వహిస్తున్న గ్రామస్తులు. 

చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్  జన్మదిన వేడుకలు నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. కార్యకర్తలు, నేతల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు. 

పార్వతీపురం మన్యం జిల్లా.

పార్వతీపురం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం అనాధ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. 

కురుపాం నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన అనంతరం వైసిపి మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. 

సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ఆధ్వర్యంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరు పట్టణంలో రాజన్న దొర ఇంటికి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు .రాజన్నదొర కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.

పాలకొండ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  వై.యస్ జగన్‌ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలకొండ లో ఎమ్మెల్సీ విక్రాంత్  కేక్ కట్ చేశారు. అనంతరం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.వీరఘట్టం మండలం వండువ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కళావతి కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు  కేక్ కట్ చేశారు. బాణసంచా కాల్చారు. అనంతరం స్వీట్స్ పంచి పెట్టారు. భామిని లో  మాజీ సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా. 
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘనంగా మాజీ సిఎం వైయ‌స్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాడేరు  మోదకొండమ్మ తల్లి ఆలయంలో  ఎంఎల్ఏ మత్స్యరాస విశ్వేశ్వర రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 

అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో  అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఘనంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ 52 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు, పాడేరు మాజీ శాసన సభ్యురాలు   కొట్ట గుళ్లి భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,  అరకులోయ నియోజకవర్గం జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు,  అభిమానులు పాల్గొన్నారు. 

చింతూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా  ఘనంగా రాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఏజెన్సీ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 

అనకాపల్లి జిల్లా.
చోడవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఘనంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలును కేక్ కట్ చేసే  మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులుఘనంగా నిర్వహించారు. పలు చోట్ల అన్నదానం నిర్వహించడంతో పాటు చోడవరం ఆసుపత్రులలో రోగులకు పాలు రొట్లు పంపిణీ చేశారు. 

నర్సీపట్నం లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసి, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సంబరాలు చేశారు. అనంతరం ఉమా శంకర్ గణేష్ రక్త దానం చేశారు. 

మాడుగుల నియోజకవర్గంలో  వైయ‌స్.జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకులను మాజీ ఉపముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా వైసీపి అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు ఘనంగా నిర్వహించారు. 

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఘనంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పలు చోట్ల అన్నదానo,  ఆసుపత్రులలో రోగులకు పాలు రొట్లు పంపిణీ చేశారు. 

ఎలమంచిలి నియోజకవర్గంలో  మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అచ్యుతాపురం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం అచ్యుతాపురంలో గల వికలాంగుల ఆశ్రమంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు,  అచ్యుతాపురం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ యు సుకుమార్ వర్మ అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షులు దేశం శెట్టి శంకర్రావు, ఎంపీపీ కోన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలో  వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా నియోజకవర్గ సమన్వయకర్త మలసాల  భరత్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయడంతో పాటు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 

పెందుర్తి నియోజకవర్గం పరవాడలో  మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కేట్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. 

నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ రక్తదానం చేశారు. 

ys jagan mohan reddy birthday celebrations in andhra pradesh photos goes viral2
విశాఖపట్నం జిల్లా.
విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుకలను పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాద్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్,పార్లమెంట్ సభ్యులు,శాసనమండలి సభ్యులు,మాజీ ఎమ్మెల్యేలు,సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పుట్టిన రోజు సందర్భంగా నియోజవకర్గ సమన్వయకర్త  కె.కె రాజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వార్డు పి.ఆర్ గార్డెన్స్ వానప్రస్థ వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్,49వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు,14వార్డు కార్పొరేటర్ కె.అనిల్ కుమార్ రాజు,సీనియర్ నాయకులు అంబటి శైలేష్,సరస్వతి,కనక, హైమ,కర్రీ రామారెడ్డి,ఢిల్లీరావు,చంద్రమౌళి,సబ్బవరపు శ్రీను, యస్.రాము,మస్తాన్,వెంకటరావు,రెహ్మాన్,చైతన్య,శివరాం, ప్రసాద్, రమణ, అప్పారావు, శ్రీరాములు, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీతమ్మదార ఎం.ఆర్.ఓ ఆఫీస్ ఎదురుగా గల నక్కవానిపాలెం స్వర్గీయ వై.యస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి  వృద్ధులకు పండ్లు మరియు చీరలు పంపిణీ చేశారు.

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ సీఎం వైయస్.జగన్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖ 88 వ వార్డు నరవ గ్రామం లో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో వార్డు అధ్యక్షుడు దాడి నూకరాజు ఆధ్వర్యంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. పేదలకు పళ్ళు, బ్రెడ్  పంపిణీ చేయడంతో పాటు వారికి రగ్గులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

పెందుర్తిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత గండి రవికుమార్ ఆధ్వర్యంలో  లయోలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు , పండ్లు , బ్రెడ్ అందించారు. 51 వ వార్డు పరిధిలో కార్పొరేటర్ వెంకటరమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 

విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నగర కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్ఫంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాత్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సహా పలువులు నేతలు హాజరయ్యారు. 
తూర్పుగోదావరి జిల్లా. 
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్  జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరాపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 

అనంతరం వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి కార్యకర్తలు, నాయకులు మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజవర్గ పరిధిలో నాలుగు మండలాల నుంచి భారీగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. 

రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ డెంటల్ శిబిరాలు ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొని వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు చందన నాగేశ్వర్ బ్లడ్ డొనేట్ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ,  వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ  కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. 

జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి తోట నరసింహం, నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ గుల్లా ఏడుకొండలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 

నిడదవోలు  వైయ‌స్ఆర్‌సీపీ  కార్యాలయం లో కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

కొవ్వూరు నియోజకవర్గంలో  వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కేక్ కట్ చేసి వృద్దులకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు  పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. 
కాకినాడ జిల్లా

పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట  వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా  వైయస్ జగన్ జన్మదిన వేడుకలు.  కేక్ కట్ చేసిన పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

జగ్గంపేట మెయిన్ రోడ్డులో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఘనంగా మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.కేక్ కట్ చేసిన జగ్గంపేట ఇన్చార్జి తోట నరసింహం.

తుని నియోజకవర్గంలో ఘనంగా మాజీ సీఎం వైయ‌స్ జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా,యనమల కృష్ణుడు.

జగ్గంపేట వైయ‌స్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనంతరం  ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
అమలాపురం గడియారం సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ  కుడుపూడి సూర్యనారాయణ రావు,  బొమ్మి ఇజ్రాయిల్, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 

రాజోలు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ సిపి ఇంచార్జ్  మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో వైయస్సార్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పుట్టిన రోజు వేడుకలను మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపేట బస్టాండు సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. 

మండపేటలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్బంగా మండపేట వైయస్ఆర్ సీపీ  కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. 

ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడ వాడలా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 52 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 

పి గన్నవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను అంబాజీపేటలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. 

ys jagan mohan reddy birthday celebrations in andhra pradesh photos goes viral12
ఏలూరు జిల్లా 
కైకలూరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్  పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన వైయస్సార్సీపీ నేతలు. ర్యాలీలో పాల్గొన్న ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు  మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. వేలాదిగా హాజరైన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు.. కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు. 

చింతలపూడి నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త కంబం విజయరాజు. ఈ సందర్బంగా  బట్టువారిగూడెం అనాధ ఆశ్రమంలో పిల్లలకు అన్నదానం చేసిన వైసీపీ నాయకులు గోలి చిట్టిబాబు రెడ్డి, పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ జన్మదిన వేడుకలనువైయ‌స్ఆర్‌సీపీ  నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు.

టీ నర్సాపురం మండలం నర్సాపురం లో జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఏలూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో  మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  నియోజకవర్గ  ఇన్ చార్జ్ జయప్రకాష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,మాజీ డిప్యూటీ మేయర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

ఏలూరు నియోజకవర్గ ఇన్ చార్జి జయ ప్రకాష్ కామెంట్స్

జగనన్నను ముఖ్యమంత్రినీ చేసుకోక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు.. 

వైయ‌స్ జ‌గ‌న్  హయాంలో ప్రతి పేదలకు  ఒక సంక్షేమ పథకం అమలు చేసేవారు

చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రజలను మంచేశారు...
 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అభివృద్ది జరిగింది శూన్యం 

వైయ‌స్ జ‌గ‌న్  నీ అందరూ మరలా ముఖ్యమంత్రి నీ చేసుకుంటాం . 

కార్పొరేటర్ల కామెంట్స్
జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.
పేదల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి వైయ‌స్ జ‌గ‌న్‌  ఒక్కరే 

జనహృదయనేత అంటే  వైయ‌స్ జ‌గ‌న్ ఒక్కరే 

తండ్రి ఆశయాలు పనికి పుచ్చుకున్న నాయకుడు వైయ‌స్‌ ఒక్కరే 

ఈరోజు మాజీ అయితే కావచ్చు కానీ జన హృదయాలలో ఎప్పుడూ జగనన్న హీరోనే...

ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండల గ్రామాలలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 

చింతలపూడి మండలం చింతలపూడి లో వైయ‌స్ఆర్‌సీపీ మండల అధ్యక్షులు జగ్గవరపు జానకిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు బొడ్డు వెంకటేశ్వరావు, ఎంపీపీ రాంబాబు,టౌన్ అధ్యక్షులు కొప్పుల నాగు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

జంగారెడ్డిగూడెంలో  ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు ఏలూరు పార్లమెంట్ ఇన్ ఛార్జి,కారుమూరి సునీల్, నియోజకవర్గ కన్వినర్ కంభం విజయరాజు,  రాష్ట్ర కార్యదర్శి జెట్టిగురునాధరావు,కౌన్సిలర్లు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

దెందులూరు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జ‌గ‌న్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసిపి కార్యకర్తల సమక్షంలో పార్టీ నేతలు భారీ కేక్ కటింగ్ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు తెర ఆనంద్, కొల్లేరు గ్రామ అధ్యక్షులు ముంగర సంజీవ్, వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య  నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

పశ్చిమగోదావరిజిల్లా.
ఉండి నియోజకవర్గంలో కాళ్ల మండలం పెదమిరం పార్టీ కార్యాలయంలో  ఉండి నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పివిఎల్ నరసింహారాజా ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయ‌స్ జ‌గ‌న్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. 

నరసాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్సీపీ నాయకులు పి.డి.రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  మునిసిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, కౌన్సిలర్లు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

పాలకొల్లు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో నియోజక వర్గ ఇంచార్జీ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ,చేగొండి సూర్య ప్రకాష్, రాష్ర్ట కార్యదర్శి చిలువూరి కుమార  దత్తాత్రేయ వర్మ, యూత్ ప్రైసిడెంట్ కుంచిలపల్లి వినిష్టన్ బాబు,కర్ర జయ సరిత పాల్గొన్నారు. 

తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటి సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైసీపీ క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి వైయస్.జగన్మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

భీమవరంలో పట్టణ వైఎస్ అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు  బ్రెడ్స్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గౌడ్ కార్పొరేషన్ సభ్యులు కావున నాగేశ్వరరావు  వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు మాజీ డిహెచ్ఎంఎస్ చైర్మన్ వెండ్ర వెంకటస్వామి వైసిపి సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్  కోడే యుగంధర్
పాల్గొన్నారు. 

ఎన్టీఆర్ జిల్లా. 
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న  రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద  60కేజీల కేక్ కట్ చేసిన వైయస్సార్సీపీ నేతలు వైయస్. జగన్ మోహన్ రెడ్డి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజవర్గ ఇన్చార్జిలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పి ఎస్ సి సభ్యులు షేక్ ఆసిఫ్, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి,  డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

వెల్లంపల్లి శ్రీనివాస్ (పీఏసీ సభ్యుడు) కామెంట్స్. 

ప్రతి ఇంటికి పెద్ద కొడుకు జగన్..

జగన్ పుట్టినరోజు వేడుకలు ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతున్నాయి.

5ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన నేత జగన్.

కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకొన్నమా అని ప్రజలు అనుకొంటున్నారు.

సూపర్ సిక్స్ లేదు.

ఉచిత బస్సు ఎక్కడ ఉందో తెలీదు.

విద్యుత్ ఛార్జీలు మోపి బాదుడు మీద బాదుడు వేస్తున్నారు.

ప్రతి మహిళను చంద్రబాబు మోసం చేసాడు.

అమరావతి, పోలవరం తప్ప దేని గురించి మాట్లాడం లేదు.

టోల్ గేట్స్ పెట్టి ప్రజల రక్తం తాగుతున్నారు.

విజయవాడలో వరదలు వస్తే సరిగ్గా చూడలేదు.. ఇక రాష్టానికి ఏమి చేస్తారు. 

మళ్ళీ జగన్ రావాలి, జగన్ వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి అని ప్రజలు అనుకొంటున్నారు.

ys jagan mohan reddy birthday celebrations in andhra pradesh photos goes viral3
దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు.

జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.

మహిళకు చీరలు పంపిణీ చేస్తున్నాం.

ప్రతి పేదవాడు జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారు.

జగన్ లేని లోటు 6నెలల కాలంలో ప్రజలు చూసారు.

అమ్మఒడి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా ఏ సంక్షేమ పధకం లేదు.

1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు.. కరెంట్ చార్జీలు పెంచారు.

మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకొంటున్నారు.

ys jagan mohan reddy birthday celebrations in andhra pradesh photos goes viral6
భాగ్యలక్ష్మి, నగర మేయర్

గత 5ఏళ్ల పాలనను ప్రజలు గుర్తు చేసుకొంటున్నారు.

కూటమి ప్రభుత్వం వొచ్చిన 6నెలల కాలంలో ప్రజలపై భారాలు వేసింది.

కూటమి నేతలకు రానున్న కాలంలో బుద్ధి చెపుతారు.

అవుతు శైలజా రెడ్డి..డిప్యూటీ మేయర్

జగన్ అంటే ఆయన పెట్టిన పథకాలే గుర్తు వస్తాయి.

కూటమి పాలన కంటే జగన్ వెయ్యి రేట్లు బెటర్ అని ప్రజలు భావిస్తున్నారు.

సంపద సృష్టి అని ప్రజల నుండి పిండుతున్నారు. 

ముగ్గురు కలిసి వొచ్చిన డబ్బులు లేవని చెపుతున్నారు.

సంపద సృష్టించడం తెలియని వాళ్లకు ఓటు వేసమని ప్రజలు భావిస్తున్నారు.

జగన్ ఉంటే మా అకౌంట్స్ కళకళ లాడేదని మహిళలు చెపుతున్నారు..

మహిళ పక్షపాతి జగన్. 

వైస్సార్సీపి నేతలపై కేసులు పెట్టడం కాకుండా ప్రజల సంక్షేమం పై దృష్టి పెట్టాలి.

బెల్లం దుర్గ, డిప్యూటీ మేయర్.

దుర్గమ్మ  దయ వల్ల మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు

మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజక వర్గ ఇన్ ఛార్జి.

విజయవాడ వ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కి మంచి పరిపాలన అందించిన నాయకుడు జగన్. 

ప్రజలను సంక్షేమ పథకాలు అందించి ఏ విధంగా అదుకోవచ్చో చూపించాడు.

జగన్ పేరు చెపితే ఉలిక్కి పడుతుంది కూటమి ప్రభుత్వం

జన్మదిన వేడుకలు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. బ్యానర్లు చించుతున్నారు.

ఇల్లు అమ్మకాలు, కొనుగోళ్లు చేయాలంటే పన్నులు పెంచేశారు.

6నెలల కాలంలో చంద్రబాబు బాదుడే బాదుడు అమలు చేస్తున్నారు.

గత5 ఏళ్లలో సుస్థిరరమైన పాలన ప్రజలకు అందింది.

పక్క రాష్టాలు సైతం మన రాష్టానికి వొచ్చి చేసుకొన్నారు.

పోర్టులు, మెడికాల్ కాలేజ్ లు ప్రవేట్ వారికి ధారాదత్తం చంద్రబాబు ధారాదత్తం చేశారు.

వేలకోట్ల ఆస్తులు ధ్వంసం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది.

రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుంది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్. జగన్  మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ పీఏసీ కమిటీ మెంబర్ షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంజా సెంటర్ లో బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించడంతో పాటు కేక్ కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం శ్రీ వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసిన వైస్సార్సీపీ నేత పోతిన మహేష్. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పోతిన మహేష్. 

పోతిన మహేష్ కామెంట్స్. 
జననేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 

అభివృద్ధి సంక్షేమం సమపాళ్లల్లో అందించిన గొప్ప పాలన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 

అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ ఎత్తైన బిల్డింగులు కాదు ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం. 

విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి పేద సామాన్య వర్గాలను ప్రపంచస్థాయి నాణ్యమైన విద్య అందించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ గారిది. 

వైద్యరంగంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి శంకుస్థాపనలకే పరిమితం కాకుండా 14 మెడికల్ కాలేజీ లను నిర్మించిన గొప్ప పాలన వైఎస్ జగన్ గారిది. 

పోర్టులు, హార్బర్లు నిర్మించి అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించినటువంటి వ్యక్తి వైయస్ జగన్ గారు.

జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజ్ గోపాల్ (చిన్నా )ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. 

తిరువూరు నియోజకవర్గంలో  మాజీ సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్యాక్టరీ సెంటర్ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

జగ్గయ్యపేట నియోజకవర్గంలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్  తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ,ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ, రిక్షా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 

కృష్ణాజిల్లా.
పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కానూరులో కేక్ కట్ చేసి, 500 మంది పేదలకు దుప్పట్లు, పంపిణీ,అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, అన్నే శ్రావణ్.
కంకిపాడులోనూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన  పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి.

గన్నవరం ఎస్సి కాలనీలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండి.గౌసాని ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన వైసీపీ నాయకులు.

ఉయ్యూరు లో కేక్ కట్ చేసి ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ కుమార్, వైఎస్ఆర్సిపి అభిమానులు పాల్గొన్నారు. 

అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో మాజీ సిఎం వైయస్.జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా  మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ కేక్ కట్ చేసారు. అనంతరం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. 

పెడన నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మాజీ సిఎం వైయస్.జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము, జడ్పీటీసీ హారిక ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం పెడన ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. 

పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు (మ) తోట్లవల్లూరు గ్రామంలో  మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. 

గుడివాడలో ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి వైయస్.జగన్మహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

మైలవరం లో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 


గుంటూరు జిల్లా
గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమం

వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి కేక్ కట్ చేసిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు, గుంటూరు ఈస్ట్ సమన్వయకర్త నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త డైమండ్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకతోటి దయాసాగర్ 

ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన బలసాని కిరణ్ కుమార్

తుళ్లూరు మండలం దొండపాడు లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, పేదలకు దుస్తులు పంపిణీ చేసి ,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు

మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో నూరి ఫాతిమా ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

 పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు

పల్నాడు జిల్లా
చిలకలూరిపేటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ మంత్రి విడదల రజిని,  ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన విడదల రజిని

దాచేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో  కేక్ కట్ చేసి ,రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి,మానసిక వికలాంగులకు దుస్తులు,పండ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

నరసరావుపేట లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో  కేక్ కట్ చేసి,   ప్రభుత్వ ఆస్పత్రిలో   చేసిపండ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

బాపట్ల జిల్లా

పర్చూరులో వాడవాడలా ఘనంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు...

కేక్ కట్ చేసి అందరికి అన్నదానం చేసిన పార్టీ నాయకులు...

చీరాలలో ఘనంగా వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..

స్థానిక గడియార స్తంభం సెంటర్లో పుట్టినరోజు కేకులు కట్ చేసిన వైయస్ఆర్సీపీ నాయకులు..

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు

భట్టిప్రోలు మండలం వేమవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పుట్టినరోజు కార్యక్రమాన్ని కేక్ కట్ చేసిన వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త
 వరికూటి అశోక్ బాబు.

ప్రకాశం జిల్లా

ఒంగోలు వైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా వైస్సార్సీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓంగోలు పార్లమెంట్ పార్టీ ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి,ఒంగోలు అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జి చుండూరి రవిబాబు, జడ్పి చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ   సిటీ ఇంఛార్జి కటారి శంకర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి రమణారెడ్డి,వెంకటేశ్వర రావు,కెవి ప్రసాద్ 

పార్టీ కార్యాలయంలో రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు

పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

 కొండేపి నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జ్ మాజీ మంత్రి సురేష్ ఆద్వర్యంలో లో  సింగరాయకొండ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు  కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన మాజీ మంత్రి సురేష్

ప్రకాశం జిల్లా కంభం కందులాపురం సెంటర్ లో కుందురు నాగార్జున రెడ్డి అద్వర్యం లో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ కార్యకర్తలు అభిమానులు

యర్రగొండపాలెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు...

యర్రగొండపాలెం పట్టణంలో  వైయస్.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్,వైసీపీ ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు...

మార్కాపురం పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు 

గడియార స్తంభం సెంటర్లో వైయస్సార్ విగ్రహం వద్ద జగన్ జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలుతో కలిసి కేక్ కట్ చేసిన మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు

నెల్లూరు జిల్లా

జిల్లా పార్టీ కార్యాలయంలో వైయస్‌ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన మాజీ మంత్రి కాకాణి, రూరల్ ఇంచార్జి అనం విజయ్ కుమార్ రెడ్డి..

- వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి.. కేక్ కట్ చేసిన కాకాణి, విజయ్ కుమార్ రెడ్డి..

నెల్లూరు సిటీ ఇంచార్జి, ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పండుగలా మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు..

- హాజరైన మాజీ మంత్రి అనిల్, భారీగా తరలి వచ్చిన శ్రేణులు..

- భారీ కేక్ కట్ చేసి.. మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన MLC చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్..

ఆత్మకూరు నియోజకవర్గం లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. 

ఆత్మకూరు మేకపాటి క్యాంపు కార్యాలయంలో 52 కిలోల భారీ కేకును కట్ చేసిన  కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య మరియు పట్టణ వైసీపీ నాయకులు. 

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిన అభిమానులు నాయకులు. 

పట్టణంలో జిల్లా వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు.

తిరుపతి జిల్లా

వాకాడు లో వెంకటగిరి ఇంచార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, పాల్గొన్న వైస్సార్ సీపీ నాయకులు. కార్యకర్తలు.

- పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో మాజీ మాజీ ఎన్ డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 

కర్నూలు జిల్లా

మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.

వెల్దుర్తి వైసిపి కార్యాలయంలో ఘనంగా వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, జ్యూస్ పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

ఎమ్మిగనూరులో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు  వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి బ్లడ్ క్యాంప్ ని ప్రారంభించి గవర్నమెంట్ హాస్పిటల్ నందు కుర్చీలను పంపిణీ చేసిన వైయస్సార్సీపి సీనియర్ నాయకులు ఎర్రకోటి జగన్ మోహన్ రెడ్డి , బుట్ట నీలకంఠం, వై రుద్ర గౌడ్.
 పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు..

ఆదోనిలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సంధర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్..

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 40వ వార్డు లో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు చీరలు అందజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,  కార్పొరేటర్ విక్రమ్ సింహా రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు..


నంద్యాల జిల్లా
నంద్యాల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్సిపి నేతలు.

కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ ఇస్సాకు భాష , మున్సిపల్ చైర్మన్ మా బున్నీసా , వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు...

ఆళ్లగడ్డ లోని స్థానిక వైసీపీ కార్యాలయం లో వైయస్సార్సీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసి, అనంతరం చాగలమర్రి లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రీజెంద్రా రెడ్డి, వైసీపీ నాయకులు..

అనంతపురం జిల్లా

కళ్యాణదుర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో మాజి ఎంపి సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి..

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా రాయదుర్గంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిన సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి .

మాజీమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాప్తాడులో కేకు కట్ చేసిన మాజీఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

ఉరవకొండలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు వై. ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ పాల్గొన్న మేయర్ మహమ్మద్ వాసీం, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ

శ్రీ సత్యసాయి జిల్లా

కదిరి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. సమన్వయకర్త మక్బూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు.

పెనుకొండ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు, పార్టీ శ్రేణులతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసిన మాజీమంత్రి శంకర్ నారాయణ.

మడకశిరలో సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి సంబరాలు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు,పండ్లు పంచిన సమన్వయకర్త ఈరలకప్ప, నాయకులు,కార్యకర్తలు

హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద హిందూపురం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో ఘనంగా జన నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు.

అన్నమయ్య జిల్లా

రైల్వే కోడూరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు....

టోల్గేట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన కొరముట్ల శ్రీనివాసులు

వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు. పేదలకు చీరల పంపిణీ

రాజంపేటలో ఘనంగా జననేత మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు...

రాజంపేట పాతబస్టాండ్ కూడలిలో దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథరెడ్డి...

ys jagan mohan reddy birthday celebrations in andhra pradesh photos goes viral10
వైఎస్సార్‌ జిల్లా

--- పులివెందుల నియోజకవర్గంలో వాడవాడలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. 

--- పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మహేష్ మనోహర్ రెడ్డి. 

-- మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వమత ప్రార్థనలు. 

-- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప. 

-- పట్టణంలోని వికలాంగుల నెట్వర్క్ కార్యాలయంలో వికలాంగులకు బట్టలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్. 

-- వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం, అంధుల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన వైకాపా శ్రేణులు. 

--- నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి చేపట్టిన సేవా కార్యక్రమాలు.

ప్రొద్దుటూరు లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

వృద్దా ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కటచేసిన రాచమల్లు ,వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు

బద్వేల్ నియోజకవర్గం లో  ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు...

 ఎమ్మెల్సీ డిసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

 జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు కలిసి భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి..

కమలాపురం లో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

పలు సేవా కార్యక్రమాలలో పార్టీ ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి. 

కమలాపురం స్థానిక అనాధ క్షేత్రాలయంలో అనాధ బాలల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. 

అనాధ బాలలకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన జట్పీటిసి సుమిత్రా రాజశేఖరరెడ్డి. 

స్థానిక పార్టీ కార్యాలయం వద్ద గల వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నరేన్ రామాంజుల రెడ్డి. 

కడపలో ఘనంగా మాజీ సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు..

మైనార్టీ నాయకుడు రహీమ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం..

పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం ఆంజద్ భాష కడప మేయర్ సురేష్ బాబు...

ఘనంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు 

భాకరాపురంలోని వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేత వైయస్ మనోహర్ రెడ్డి. 

జమ్మలమడుగులో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

ys jagan mohan reddy birthday celebrations in andhra pradesh photos goes viral13
చిత్తూరు జిల్లా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  విజయానంద రెడ్డి

చిత్తూరు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన విజయనంద రెడ్డి

అనంతరం,ఎమ్మెస్సార్ ,దర్గా సర్కిల్ , ప్రభుత్వ హాస్పిటల్ లో సంతపేట లో కేక్ కటింగ్ చేసిన విజయానంద రెడ్డి

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్  పంపిణీ చేసిన విజయనంద రెడ్డి

పూతలపట్టు నియోజకవర్గం ఐదుమండలాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు

బంగారుపాళ్యం మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసే అన్నదానం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
సత్యవేడు మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గం  సమన్వయకర్త నూక తోటి రాజేష్, సీనియర్ నాయకుడు బీరేంద్ర రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు  నిర్వహించిన కుప్పం నియోజకవర్గం ఇన్చార్జి, ఎమ్మెల్సీ భరత్..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు

నగిరిలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

కేక్ కటింగ్ లు అన్నదాన కార్యక్రమాల మధ్య జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి

జన్మదిన వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా 

నగరి టవర్ క్లాక్ సెంటర్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు

బెంగుళూరు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బెంగుళూరు లోని  వైఎస్ జగన్ నివాసం లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Back to Top